STOCKS

News


ఈ రెండు కంపెనీల్లో ఎంత ఇన్వెస్ట్‌ చేశారు ?

Friday 28th September 2018
Markets_main1538109743.png-20666

న్యూఢిల్లీ:  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌... ఏ మేరకు ఇన్వెస్ట్‌ చేశాయో వెల్లడించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలను అడిగింది.లిక్విడిటీ భయాలు నెలకొన్న నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ను సెబీ ఈ వివరాలను కోరిందని సమాచారం. ఈ రెండు కంపెనీల్లో ప్రస్తుతమున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రోల్‌ఓవర్‌ చేయవద్దని సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సూచించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

రుణాల చెల్లింపుల్లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు విఫలమైన విషయం తెలిసిందే. లిక్విడిటీని పెంచుకునేందుకు దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) వాణిజ్య పత్రాలను డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ డిస్కౌంట్‌కు విక్రయించింది. ఈ రెండు అంశాల కారణంగా లిక్విడిటీ సమస్యలున్నాయనే ఆందోళనతో హౌసింగ్‌ ఫైనాన్స్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల షేర్లు గత కొన్ని రోజులుగా నష్టపోతున్నాయి.



You may be interested

దేశీ విమానయాన సంస్థల సేఫ్టీ ఆడిట్‌ షురూ..

Friday 28th September 2018

న్యూఢిల్లీ: దేశీ విమానప్రయాణాల్లో ఇటీవల పలు వివాదాస్పద ఉదంతాలు నమోదవుతున్న నేపథ్యంలో విమానాల్లో రక్షణ చర్యలపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రత్యేక సేఫ్టీ ఆడిట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేసే షెడ్యూల్డ్ విమానయాన సంస్థలన్నింటిపైనా ఆడిట్ జరుగుతోందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి ముంబై కేంద్రంగా పనిచేసే ఎయిర్‌లైన్స్ ఆడిట్ చేపట్టనున్నట్లు వివరించారు. విమానయాన సంస్థల కార్యకలాపాలతో పాటు శిక్షణా కార్యక్రమాలు..

మొండి బకాయిల విషయమై ఎలాంటి అవకతవకలు లేవు

Friday 28th September 2018

ముంబై: మొండి బకాయిల విషయమై ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని యస్‌బ్యాంక్‌ స్పష్టం చేసింది. మొండి బకాయిలను కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా అని ఇటీవలనే నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) యస్‌బ్యాంక్‌ని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా యస్‌బ్యాంక్‌ ఈ వివరణ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి తమ స్థూల మొండి బకాయిలు 1.3 శాతంగా, నికర మొండి బకాయిలు 0.59 శాతంగా ఉన్నాయని పేర్కొంది. భారత బ్యాంకింగ్‌ చరిత్రలోనే

Most from this category