STOCKS

News


రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియో రివ్యూ..

Monday 22nd October 2018
Markets_main1540190227.png-21357

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియోలో ఎలాంటి మార్పులు వచ్చాయి, కొత్తగా వేటిని కొన్నారు, వేటిని విక్రయించారు? చూద్దాం..
- క్యు2లో రాకేశ్‌ పోర్టుఫోలియోలోకి కొత్తగా ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, స్పైస్‌జెట్‌ షేర్లు చేరాయి. స్పైస్‌జెట్‌లో రాకేశ్‌ 1.25 శాతం వాటా కలిగిఉన్నారు. ఫోర్టిస్‌లో 2 శాతం వాటాను కొనుగోలు చేశారు. 
- ఇదే సమయంలో 13 కంపెనీల్లో ఆయన వాటాలు యథాతధంగా ఉన్నాయి. వీటిలో ఆగ్రోటెక్‌ఫుడ్స్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, మాన్‌ ఇన్‌ఫ్రా, ఎంసీఎక్స్‌, మంధనా రిటైల్‌ వెంచర్స్‌ ఉన్నాయి. 
- డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎన్‌సీసీల్లో రాకేశ్‌ వాటాలు పెంచుకున్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో వాటాను ఆయన 2.76 శాతం నుంచి 3.19 శాతానికి పెంచుకున్నారు. క్యు2లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు దాదాపు 60 శాతం పతనమైన సంగతి తెలిసిందే.
- క్రిసిల్‌, జైపీ అసోసియేట్స్‌, లుపిన్‌లో వాటాలను రాకేశ్‌ క్యు2లో విక్రయించారు.
రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే కంపెనీ ద్వారా రాకేశ్‌ తన పేరుమీద లేదా తన భార్య రేఖ పేరు మీద షేర్లు కొంటుంటారు. పైన పేర్కొన్న వివరాలు ఆయా కంపెనీలు సమర్పించిన వాటాదారుల వివరాల నుంచి సేకరించడం జరిగింది. క్యు2లో రాకేశ్‌ పోర్టుఫోలియో బాగా నష్టాలు చవిచూసింది. ఈ సమయంలో ఆయన పోర్టుఫోలియోలో పలు షేర్లు 5- 60 శాతం వరకు నష్టాలు చవిచూశాయి. ఫోర్బ్స్‌ ఇండియా ప్రకారం భారత కుబేరుల్లో రాకేశ్‌ 61వ స్థానంలో ఉన్నారు. 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ 

Monday 22nd October 2018

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సానుకూల ఆర్థిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం బ్యాంకింగ్‌ షేర్లు జోరుగా పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతంపైగా జంప్‌చేసి రూ.2014 గరిష్టస్థాయికి చేరిన అనంతరం ఉదయం 12 గంటల సమయానికి రూ. 2000 సమీపంలో ట్రేడవుతోంది. ఈ షేరు వెయిటేజీ అధికంగా కలిగిన బ్యాంక్‌ నిఫ్టీ ఇదే సమయానికి 1.4 శాతం ర్యాలీ జరిపి 25,400 పాయింట్ల స్థాయిని అధిగమించింది.

రెడ్‌మి నోట్‌-6 ప్రో వచ్చేస్తోంది..

Monday 22nd October 2018

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ‘రెడ్‌మి నోట్‌-6 ప్రో’ను నవంబర్‌లో మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. నవంబర్‌ 10-19 మధ్యలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర సుమారు రూ.15,500గా ఉండొచ్చు. ప్రత్యేకతలు.. ఫ్లాగ్‌షిప్‌ కెమెరా కిల్లర్‌ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్‌ రియర్‌ కెమెరా (12 ఎంపీ+ 5 ఎంపీ), డ్యూయెల్‌ ఫ్రంట్‌ కెమెరా (20 ఎంపీ+2 ఎంపీ)

Most from this category