STOCKS

News


ఓపిక ఉంటే మిడ్‌క్యాప్స్‌లో మంచి అవకాశాలు!

Friday 10th May 2019
Markets_main1557481706.png-25666

దీర్ఘకాలిక ధృక్పథంతో వేచిచూసే మదుపరులకు మిడ్‌క్యాప్స్‌ మంచి అవకాశాన్నిస్తున్నాయని ఏగన్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ సీఐఓ సైబల్‌ ఘోష్‌ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మార్కెట్లో తీవ్రకదలికలు, లార్జ్‌క్యాప్స్‌ హవా అనే రెండు అంశాలు ఎలాంటి మార్పులేకుండా ఉన్నాయన్నారు. ఆర్థిక సంవత్సరం మారినా మార్కెట్లో నిర్దిష్ట దిశానిర్దేశం లేదన్నారు. దీంతో మదుపరులు ఎక్కువగా పెద్ద స్టాకులవైపు చూస్తున్నారని, అందువల్లే మొత్తం మార్కెట్‌ కన్నా లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే మంచి ప్రదర్శన చూపుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఎఫ్‌పీఐలు లార్జ్‌క్యాప్స్‌లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయన్నారు. ఇదే సమయంలో చిన్న, మిడ్‌క్యాప్‌ సూచీలు ఇంకా నేల చూపులు చూస్తూనే ఉన్నాయని తెలిపారు. దాదాపు దేశంలోని 70 శాతం ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యాయని, బలమైన ప్రభుత్వం రావాలనే మార్కెట్‌ ఆంకాంక్ష రోజురోజుకూ బలపడుతోందని తెలిపారు. అయితే మార్కెట్‌ ఆశలకు తగ్గట్లు నిజ పరిస్థితులు కనిపించడం లేదని, మార్కెట్‌ ఊహించని ఫలితాలు వచ్చే ఛాన్సులున్నాయని చెప్పారు. ఆటో, ఎఫ్‌ఎంసీజీ తదితరాల విక్రయాలు పరిశీలిస్తే ఎకానమీలో డిమాండ్‌ బాగా తగ్గుతోందని తెలుస్తోందన్నారు. నగదు లభ్యత తగ్గడం రియల్టీ, హౌసింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీలపై ప్రభావం చూపుతోందని, దీంతో ఈ రంగాల సమస్యలు క్రమంగా ఇతర రంగాలకు వ్యాపిస్తాయన్న భయాలున్నాయని చెప్పారు. చమురు ధరలు కాస్త తగ్గడమే కొంచెం ఊరటనిస్తోందని తెలిపారు.

ఆర్‌బీఐ రెండు మార్లు రేట్‌కట్‌ ప్రకటించినా వ్యాపార రుణాలపై వడ్డీలు ఇంకా దిగిరాలేదని సైబల్‌ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రిస్కుమదింపు చేసుకొని ముందడుగు వేయాలని సూచించారు. వచ్చే 5- 10 ఏళ్లు వేచిచూడగలమనే ఇన్వెస్టర్లకు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ మంచి అవకాశాన్నిస్తున్నాయని చెప్పారు. స్వల్పకాలిక ఇబ్బుందులన్నా దేశీయ ఎకానమీ దీర్ఘకాలంలో ముందుకే సాగుతుందని, అందువల్ల లాంగ్‌టర్మ్‌ కోసం పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచించారు. ఎకానమీ అనుకున్నదానికన్నా ఎక్కువ వేగంగా పెరిగితే మిడ్‌క్యాప్స్‌లోనే ముందు ర్యాలీ వస్తుందన్నారు. రాబోయే పదేళ్లలో లార్జక్యాప్స్‌ను చిన్నస్టాకులు అధిగమిస్తాయని అంచనా వేశారు. ఈ పరుగులను ఒడిసిపట్టాలంటే ఇన్వెస్టర్‌కు ఓపిక చాలా అవసరమని సలహా ఇచ్చారు. ఈ రిస్కులన్నీ ఎందుకు అనుకుంటే డెట్‌ ఫండ్స్‌ను నమ్ముకోవడం మంచిదని సూచించారు. You may be interested

11300 దిగువన ముగిసిన నిఫ్టీ

Friday 10th May 2019

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా 8వ రోజూ నష్టాలనే చవిచూసింది. మెటల్‌, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, అటో షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 96 పాయింట్లు నష్టపోయి 37,462 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 11,300ల దిగువున 11,279 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా ఎనిమిది రోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ఈ ఎనిమిది రోజుల్లో సెన్సెక్స్‌ 1603 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 488 పాయింట్లను నష్టపోయింది. అమెరికా-చైనాల మద్య

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Friday 10th May 2019

మెటల్‌ షేర్లు శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి భారీగా నష్టపోయాయి. మెటల్‌ షేర్లకు ప్రాతనిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ నేడు దాదాపు 2శాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్ల నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండంతో మన మార్కెట్లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. టాటా స్టీల్‌తో జాయింట్‌వెంచర్‌ ఏర్పాటు విఫలం కావచ్చని జర్మనీ స్టీల్ దిగ్గజ కంపెనీ థిసేన్‌క్రుప్ భావిస్తున్నట్లు రాయిటర్‌ మీడియా సంస్థ ఒక కథనాన్ని వెల్లడించడంతో టాటాస్టీల్‌

Most from this category