STOCKS

News


యాపిల్‌కు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్‌

Saturday 1st December 2018
Markets_main1543660435.png-22570

దాదాపు ఎనిమిదేళ్ల తరువాత యాపిల్‌ను వెనక్కి నెట్టి అత్యంత విలువైన అమెరికా కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ అవతరించింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో 851.2 బిలియన్‌ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఒక ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా అవతరించిన యాపిల్‌ తాజాగా 847.4 మిలియన్‌ డాలర్లకు దిగివచ్చింది. ‘‘రానున్న రోజుల్లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యాపార వృద్ధి అంచనాలతో మైక్రోసాఫ్ట్‌ షేరు 0.60 శాతం ర్యాలీ చేసి 110.89 డాలర్ల వద్ద ముగిసిం.ది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు డిమాండ్‌ తగ్గుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఆపిల్‌ షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు 0.54 శాతం నష్టపోయి 178.58డాలర్ల వద్ద స్థిరపడింది. వ్యక్తిగత కంప్యూటర్లకు డిమాండ్‌ తగ్గడం, విస్తరిస్తున్న అప్పుడుప్పుడే స్మార్ట్‌ఫోన్‌ మార్కెటింగ్‌ కారణాలతో మే28 2010లో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో మైక్రోసాఫ్ట్‌ను వెనక్కినెట్టి యాపిల్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2014లో మెక్రోసాఫ్ట్‌ పదవీబాధ్యతలు స్వీకరించిన నాదేళ్ల సత్య వ్యయ నియంత్రణతో పాటు వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో విండోస్‌ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించడటం,  క్లౌడ్‌ సేవలు, సాఫ్ట్‌వేర్‌ సేవలపై దృష్టి సారించడంతో కంపెనీ మళ్లీ లాభాల గాడిలోకి వచ్చింది.



You may be interested

మార్కెట్‌ ప్రస్తుత ఆశావాదం మోసపూరితం..!

Saturday 1st December 2018

సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు, సీఈఓ జమీత్ మోడీ వ్యాఖ్య ముంబై: కొనసాగుతున్న ఎన్నికల అంశాలను పక్కన పెట్టి దేశీ స్టాక్‌ సూచీలు గడిచిన వారం రోజుల్లో క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అమెరికా వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సూచీలు వరుసగా 5 రోజులపాటు లాభాలను నమోదుచేశాయి. వడ్డీ రేట్లకు సంబంధించి ఈయన కీలక వ్యాఖ్యలు చేసిన

హెచ్‌డీఎఫ్‌సీ రూ.9,000 కోట్ల బాండ్ల విక్రయం

Saturday 1st December 2018

ముంబై: దేశీ అతి పెద్ద మార్జిగేజ్‌ లెండర్‌ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) ఈ ఏడాదిలోనే అత్యంత అధిక మొత్తంలో బాండ్లను విక్రయించినట్లు వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా నిధుల సమీకరకు రాగా, ఇందుకు ఏకంగా మూడు రెట్లు అధిక స్పందన వచ్చిందని.. ఇందులో భాగంగా రూ.9,000 కోట్ల మేరకు విక్రయాలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి రూ.13,000 కోట్లకు బిడ్లు రాగా,

Most from this category