STOCKS

News


ఐటీ స్టాకులు ఇంకా ఆకర్షణీయమే!

Thursday 21st March 2019
Markets_main1553163103.png-24734

సంపత్‌ రెడ్డి
ఐటీ రంగ కంపెనీల షేర్ల వాల్యూషన్లు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయని, ఈ రంగంలో ఎర్నింగ్స్‌ గ్రోత్‌ కనిపిస్తోందని బజాజ్‌ అలియాన్జ్‌ సీఐఓ సంపత్‌ రెడ్డి చెప్పారు. క్రూడాయిల్‌ధర  పతనం, ఎఫ్‌ఐఐల ప్రవాహంలో రికవరీ, ఆర్‌బీఐ సహా వివిధ కేంద్ర బ్యాంకుల పాజిటివ్‌ ప్రకటనలు, దేశ ఎకానమీ పురోగమనంతో రెండు నెలలుగా రూపీ బలపడిందన్నారు. మరేదైనా భారీ అంతర్జాతీయ ఇబ్బంది తలెత్తితే తప్ప రూపీ స్థిరంగానే ఉండొచ్చని అంచనా వేశారు. ఐటీ రంగం గత ఏడాదిగా మంచి ప్రదర్శన చూపుతోందన్నారు. రూపీ బలపడుతున్న ప్రస్తుత సందర్భంలో ఇకపై ఎలాంటి ప్రదర్శన ఉంటుందన్నది పరిశీలించాలన్నారు. పలు కంపెనీలు బైబ్యాక్స్‌ ప్రకటించడం ఈ రంగానికి పాజిటివ్‌ అంశమని తెలిపారు. ఫార్మా రంగంలో క్షీణత బాటమ్‌ అవుట్‌ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి శ్రీముఖాలు తగ్గడంతో ఫార్మా రంగం ఊపిరి పీల్చుకుంటోందన్నారు. రూపీ ఇదే స్థాయిలో ఉంటే ఎర్నింగ్స్‌పై పెద్దగా భారం ఉండదన్నారు. ఫార్మా దేశీ వ్యాపారంలో రికవరీ కనిపిస్తోందని తెలిపారు.
మంచి మిడ్‌క్యాప్స్‌ ఎంచుకోవాలి
గతేడాది చిన్న, మధ్యతరహా స్టాకుల్లో గణనీయమైన పతనం వచ్చిందని సంపత్‌ తెలిపారు. దీంతో చాలా స్టాకుల వాల్యూషన్లు భారీగా దిగివచ్చాయన్నారు. ఇప్పటికైతే తాము ఇంకా లార్జ్‌క్యాప్స్‌పైనే మొగ్గు చూపుతున్నా, నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌ను కూడా ఇప్పుడు పరిశీలించవచ్చన్నారు. ఈ రంగంలో కొన్ని ఆకట్టుకొనే బాటమ్‌అవుట్‌ అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. దీర్ఘకాలిక ధృక్పధంతో పెట్టుబడులు పెట్టమని సూచించారు. హడావుడి బుల్‌మార్కెట్‌ కన్నా నిదానంగా దీర్ఘకాలం కొనసాగే బుల్‌మార్కెట్టే మంచి రాబడులు ఇస్తుందని చెప్పారు. మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ రిటర్న్‌ మధ్య అంతరం గత కరెక‌్షన్‌ తర్వాత ఇప్పుడు తగ్గుతూ వస్తోందని తెలిపారు.You may be interested

భారతీ రియాల్టీకి ఏరోసిటీ డెవలప్‌మెంట్‌

Thursday 21st March 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఏరోసిటీ కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ పనులను ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) తాజాగా భారతీ రియల్టీ కన్సార్షియంకు అప్పగించింది. ఢిల్లీలోని ఏరోసిటీలో గేట్‌వే, డౌన్‌టౌన్‌ డిస్ట్రిక్ట్స్‌లో డిజైన్‌, డెవలప్‌, ఫైనాన్స్‌, కన్‌స్ట్రక్ట్‌, ఆపరేట్‌, మేనేజ్‌, మెయింటెయిన్‌ ప్రాతిపదికన ఫేజ్‌-1లో 4.5 లక్షల చదరపు మీటర్లు, ఫేజ్‌-2లో సైతం ఇంతే విస్తీర్ణంలో కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును కన్సార్షియం చేపట్టనుంది. ఫేజ్‌-1 అభివృద్ధికి గాను వార్షిక లీజు కింద 2036

2.6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఎంబసీ రీట్‌​

Thursday 21st March 2019

-ఏప్రిల్‌ మొదటివారంలో లిస్టింగ్‌ న్యూఢిల్లీ: మన దేశపు తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌) 2.57 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ రీట్‌ ద్వారా ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ సంస్థ రూ.4,750 కోట్లు సమీకరించింది. వ్యూహాత్మక, యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ ఇటీవలనే రూ.2,619 కోట్లు సమీకరించింది. ఒక్కో యూనిట్‌కు ప్రైస్‌బాండ్‌ గా రూ.299-300 ధరలను నిర్ణయించారు. 7.13 కోట్ల యూనిట్లను ఆఫర్‌ చేస్తుండగా, మొత్తం 18.35 కోట్ల

Most from this category