STOCKS

News


రాజకీయ పరిస్థితుల రిస్క్‌పై ఆందోళన లేదు

Thursday 16th August 2018
Markets_main1534407142.png-19343

ఇటీవలి కరెక‌్షన్‌ తర్వాత మార్కెట్‌ రేంజ్‌ బౌండ్‌ అయ్యిందన్నారు జీటీఐ క్యాపిటల్‌ గ్రూప్‌కు చెందిన మాధవ్‌ ధర్‌. టర్కీస్‌ లిరా సంక్షోభం, అమెరికా డాలర్‌ బలోపేతం వంటి అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ నిఫ్టీ 11,400 మార్క్‌కు పైన స్థిరపడిందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుందనే భావంతో అమెరికాలో రేట్ల పెంపు జరుగుతోందని తెలిపారు. ప్రస్తుత వడ్డీ రేటు చక్రం.. గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లకు సమకాలికంగా లేదని, అయితే ప్రసుత్త పరిస్థితులు 1994 మెక్సికన్‌ పెసో సంక్షోభం, 2008 ఆర్థిక మాంద్యానికి భిన్నంగా లేవని పేర్కొన్నారు. రేట్ల పెంపులో మనం చివరి దశలో ఉన్నామని, ప్రస్తుతం అమెరికాకు అధిక వడ్డీ రేట్లు, వర్ధమాన మార్కెట్లకు తక్కువ వడ్డీ రేట్లు అవసరమని వివరించారు. మార్జిన్లు పుంజుకుంటున్నాయని, వృద్ధి మెరుగుపడుతోందన్నారు. అమెరికా, భారత్‌లలో ఆర్థిక వృద్ధి బలంగా ఉందని పేర్కొన్నారు. 
వచ్చే రెండేళ్లలో మార్కెట్లు మరింత ఎత్తుకు వెళ్తాయని మాధవ్‌ ధర్‌ విశ్వసించారు. మార్కెట్ల దృష్టి క్రమంగా ఎన్నికల వైపునకు మళ్లుతోందని తెలిపారు. భారత్‌లో స్టాక్‌ మార్కెట్‌పై రాజకీయ పరిస్థితుల ప్రభావం గురించి ఎక్కువగా ఏమీ ఆందోళన చెందడం లేదన్నారు. సంక్షీర్ణ ప్రభుత్వ హయంలోనూ స్టాక్‌  మార్కెట్లు మంచి పనితీరు కనబర్చాయని గుర్తుచేశారు. రాజకీయాల్లో నాటకీయ మార్పులు కనిపించినా.. ఆర్థిక వ్యవస్థలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నా అప్పుడు మార్కెట్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అమెరికాను ఉదాహరణగా తీసుకుంటే.. డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు తర్వాత పలు సంస్కరణల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుందని తెలిపారు. ఇలాంటి ట్రెండ్‌ భారత్‌లో ఉంటుందని అంచనా వేయడం లేదన్నారు. 
బ్యాంక్రప్టెన్సీ కోడ్‌ సంస్కరణ తర్వాత మొండి బకాయిల (ఎన్‌పీఏ) అంశంలో మార్పు వచ్చిందని మాధవ్‌ ధర్‌ పేర్కొన్నారు. నిజానికి చెప్పాలంటే ఎన్‌పీఏలు ఇంత కన్నా పెరగవని, తగ్గుముఖం పట్టాయని తెలిపారు. బ్యాలెన్స్‌ షీట్లు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ రంగం బలంగా ఉందని, అయితే ఎన్‌పీఏల సమస్క కారణంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగాల్సి ఉందని తెలిపారు.    You may be interested

ఆర్‌కామ్‌ 14 శాతం పతనం

Thursday 16th August 2018

ముంబై:- పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయి నానావస్థలు పడుతున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ కంపెనీ షేర్లు  నష్టాల బాట పట్టాయి. గురువారం ఇంట్రాడేలో ఆర్‌కామ్‌ షేర్లు 14 శాతం పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఆర్‌కామ్‌ షేర్లు రూ.20.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో  తెలియని కారణాలతో కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా షేరు నేటి ఇంట్రాడేలో 14శాతం నష్టపోయి రూ.17.85ల కనిష్టానికి పతమమయ్యాయి. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు ధర(రూ.20.69)తో

లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు

Thursday 16th August 2018

ముంబై:- ప్రపంచ మార్కెట్లలలో నెలకొన్న అనిశ్చితి కారణంగా మిడ్‌ సెషన్‌ సమయానికి దేశీ మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. సూచీల ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు మాత్రం లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 1శాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు పీఎస్‌యూ ఇండెక్స్‌ 3,134.70 పాయింట్ల ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఈ సూచిలో స్టే్ట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా,

Most from this category