STOCKS

News


11530 కోల్పోతే పతనమే!

Friday 12th April 2019
Markets_main1555051332.png-25091

నిఫ్టీపై నిపుణుల అంచనా
శుక్రవారం నిఫ్టీ స్వల్పరేంజ్‌లో ట్రేడవుతోంది. చార్టుల్లో బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ నమోదయింది. ఈ నేపథ్యంలో కొంతమేర బేరిష్‌ సెంటిమెంట్‌కే అవకాశాలు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ 11530 పాయింట్ల దిగువన క్లోజయితే మరింత పతనం ఉంటుందని, 11420 పాయింట్ల వరకు క్షీణించే ఛాన్సులున్నాయని అంచనా వేస్తున్నారు. బేరిష్‌ సెంటిమెంట్‌కు అడ్డుకట్ట పడాలంటే 11660 పాయింట్లపైన స్థిరంగా ముగియాల్సిఉంటుంది. అప్పుడు మరోమారు 11760 పాయింట్లను తాకే అవకాశాలు పెరుగుతాయి. ఈ స్థాయిని విజయవంతంగా దాటితే బుల్‌ట్రెండ్‌ మరలా ఆరంభం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. లేదంటే 11760 పాయింట్లను డబుల్‌టాప్‌గా ఏర్పరిచి బేర్స్‌ పట్టు బిగిస్తారని హెచ్చరించారు. నిఫ్టీ కొద్ది రోజులుగా 11500- 11700 పాయింట్ల రేంజ్‌లోనే తిరుగాడుతోంది. ఈ శ్రేణిని ఛేదిస్తేనే తదుపరి కదలికలు అంచనా వేయవచ్చు. అంతర్జాతీయ పరిస్థితులు, క్రూడాయిల్‌ ధర, స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ గమనాన్ని నిర్ధేశించనున్నాయి. ఎన్నికల సమయం కావడంతో అస్థిరత కొనసాగవచ్చు. చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పడడం అప్రమత్తతకు సంకేతం. అయితే ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ తగ్గినందున పతనం మరీ ఘనంగా ఉండకపోవచ్చని అంచనా. మరోవైపు రూపాయి 68-69 స్థాయిల్లో కదలాడుతోంది. 



You may be interested

టీసీఎస్‌ ఫలితాలు.. ఏం చూడొచ్చు!

Friday 12th April 2019

శుక్రవారం దేశీయ టాప్‌ ఐటీ కంపెనీ టీసీఎస్‌ క్యు4 ఫలితాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఫలితాలపై అనలిస్టుల పాజిటివ్‌గా ఉన్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌ రంగాల వృద్ధి, కొత్త సంవత్సరం అంచనాలు, ఐటీ బడ్జెట్‌ ట్రెండ్స్‌, డిజిటల్‌ రంగ వృద్ధి, యూరప్‌ అవుట్‌సోర్సింగ్‌, కొత్త ఆర్డర్లు తదితర అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని చెబుతున్నారు. మార్చిలో కంపెనీ స్టాకు దాదాపు 5.6 శాతం ర్యాలీ జరిపింది. గతేడాది స్టాకు దాదాపు 38

రూ.1.1 లక్ష కోట్ల డివిడెండ్‌లు

Friday 12th April 2019

చెల్లించనున్న 75 కంపెనీలు  ముంబై: బీఎస్‌ఈ 500 సూచీలోని నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న దాదాపు 75 కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీగా నజరానాలివ్వనున్నాయి. డివిడెండ్‌ చెల్లింపులు, షేర్ల బైబ్యాక్‌ రూపంలో ఈ కంపెనీలు ఇన్వెస్టర్లకు రూ.1.1 లక్షల కోట్లు చెల్లించనున్నాయి. ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ఇండియా(ఐఐఏఎస్‌) రూపొందించిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. వివిధ కంపెనీల వార్షిక ఆర్థిక నివేదికల ఆధారంగా ఐఐఏఎస్‌ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక

Most from this category