అశోక్ లేలాండ్, ఎం అండ్ ఎం డౌన్...మారుతి, టాటా మోటార్స్ అప్
By Sakshi

దేశీయ పాసింజర్ వాహన విక్రయాలు నవంబర్‌లో అంతంత మాత్రంగానే నమోదుకావడంతో ఆయాకంపెనీల షేర్లు సోమవారం మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ నెలలో మారుతి, అశోక్ లేలాండ్, టాటామోటర్స్ వాహన విక్రయాలు క్షీణించగా, ఎండ్‌అండ్‌ఎం అమ్మకాలు పెరిగాయి. పరిశ్రమలో ద్రవ్యత్వలోటు, రిటైల్ ఫైనాన్స్ తగ్గుముఖం పట్టడం, స్థూల ఆర్థిఖ వ్యవస్థ అంతంత మాత్రంగా నమోదుకావడం తదితర కారణాలు వాహన విక్రయాలపై ప్రభావాన్ని చూపాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఎన్ఎస్ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్ నేడు 9,311.65 వద్ద ప్రారంభమైంది. ఈ సూచీలో ప్రధాన షేర్ల పతనంతో అరశాతం నష్టపోయి 9214.10 వద్ద వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్ గత ముగింపు(9,270.20)తో పోలిస్తే 0.20శాతం నష్టంతో 9,270.70 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 16 షేర్లలో 8షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా, మరో 8 షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా అశోక్‌లేలాండ్ 6శాతం నష్టపోయింది. ఎంఅండ్ఎం 4శాతం, ఏపిఎల్అపోలో, హీరోమోటోకార్ప్ 2శాతం, ఎక్సైడ్, టాటామోటర్స్, ఎంఆర్ఎఫ్ షేర్లు 1శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు ఇదే సూచీలోని మదర్‌సుమి షేరు 7శాతం లాభపడింది. టాటామోటర్స్ డీవీఆర్, భాష్, మారుతి 2శాతం పెరిగాయి. ఐషర్‌మోటర్స్, అమరరాజాబ్యాటరీస్, భారత్ఫోర్జ్ షేర్లు 1శాతం లాభపడ్డాయి.
You may be interested
నిఫ్టీ మిడ్‌క్యాప్... ర్యాలీకి ఛాన్స్..!
Monday 3rd December 2018ముంబై: వచ్చే కొన్ని వారాల్లోనే మిడ్‌క్యాప్ ఇండెక్స్ 8-10 శాతం వరకు అవకాశం ఉందని కొటక్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చౌహాన్ విశ్లేషించారు. ప్రస్తుతం 4,780 పాయింట్ల స్థాయిలో ఉన్నటువంటి నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 త్వరలోనే 5,200 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని చార్టుల ఆధారంగా స్పష్టమవుతోందని వివరించారు. ఈ సూచీలోని షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆకర్షణీయ రాబడిని పొందవచ్చన్నారు. ఈ సూచీలోని
నెలరోజుల కోసం 10 సిఫార్సులు
Monday 3rd December 2018ముంబై: గతనెలలో నిఫ్టీ మూడు శాతం మేర లాభపడింది. నవంబర్ 30 ముగింపుతో ఈసూచీ 200-రోజుల సగటు కదలికల స్థాయి అయిన 10,800 పాయింట్ల ఎగువకు చేరింది. సెన్సెక్స్ 36,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ డిసెంబర్ సిరీస్ రోలోవర్స్ మూడు నెలల సగటుకు మించి నమోదయ్యాయి. ఈ అంశం ఆధారంగా సూచీలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఆర్బీఐ సమావేశం, ఎన్నికల సమయం కావడం వల్ల ఒడిదుడుకులు అధికస్థాయిలోనే