STOCKS

News


ఎడెల్వీజ్‌ నుంచి 24 బెట్స్‌

Wednesday 5th December 2018
Markets_main1543949458.png-22625

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మన మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎడెల్వీజ్‌ ప్రొఫెషనల్‌ ఇన్వెస్టర్‌ రీసెర్చ్‌ మంచి రాబడులకు అవకాశాలున్న 24 స్టాక్స్‌ను ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. 

 

అక్రిసిల్‌: కాంపోజిట్‌ క్వార్ట్జ్‌ కిచెన్‌ సింక్‌లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. వీటికి మంచి వృద్ధి అవకాశాలున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను చేరుకునేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. వచ్చే ఐదేళ్లలో రూ.500 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తోంది. 
టీమ్‌లీజ్‌: దేశంలో మానవవనరులను సమకూర్చిపెట్టే ప్రముఖ కంపెనీ. ఈ కంపెనీకి 2,250 క్లయింట్లు ఉన్నారు. 
ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు: ఈ బ్యాంకు నిర్వహణలో రూ.20,219 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రిటైల్‌ ఆధారిత, అస్సెట్‌ ఫైనాన్స్‌ వ్యాపారంలో బలంగా ఉంది. రిటైల్‌ కస్టమర్ల బ్యాంకుగా ఏటా 30-35 శాతం వృద్ధితో 2022 నాటికి 10 బిలియన్‌ డాలర్ల (రూ.70,000 కోట్లు) స్థాయికి ఎదగాలని బ్యాంకు లక్ష్యం పెట్టుకుంది. 
విశాఖ ఇండస్ట్రీస్‌: బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ విభాగంలోట్‌ ఆస్బెస్టాస్‌ ఉత్పత్తులు, ఫైబర్‌ సిమెంట్‌ ఫ్లాట్‌ ఉత్పత్తులను విక్రయిస్తోంది. టెక్స్‌టైల్స్‌ డివిజన్‌ కూడా ఉంది. రూ.800 లక్ష్యంతో ఈ స్టాక్‌కు ఎడెల్వీజ్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. 
ఒబెరాయ్‌ రియాలిటీ: ముంబైలో ప్రముఖ రియల్టీ డెవలపర్లలో ఈ కంపెనీ కూడా ఒకటి. నివాస, కార్యాలయ, రిటైల్‌ హాస్పిటాలిటీ, విద్యా సంస్థలకు బిల్డింగ్‌ల నిర్మాణంలో సేవలు అందిస్తోంది. ప్రస్తుత ధర రూ.425 వద్ద ఈ స్టాక్‌ ఆకర్షణీయంగా ఉందని ఎడెల్వీజ్‌ పేర్కొంది. 

 

ఇంకా ఎంబి ఇండస్ట్రీస్‌, ఇమామి పేపర్‌ మిల్స్‌, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌పీ అపారెల్స్‌, రికో ఆటో ఇండస్ట్రీస్‌, ఫ్యూచర్‌ సప్లయ్‌చైన్‌ సొల్యూషన్స్‌, గోదావరి పేపర్‌, హెరిటైజ్‌ ఫుడ్స్‌, ఇండోసోలార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌ అరెనా, జమ్నా ఆటో ఇండస్ట్రీస్‌, జిందాల్‌ స్టీల్‌ హిసార్‌, మ్యాగ్నా ఫిన్‌కార్ప్‌, మిండా ఇండస్ట్రీస్‌, ప్రభాత్‌ డెయిరీ, ప్రిస్మ్‌ జాన్సన్‌, రామకృష్ణ ఫోర్జింగ్స్‌, వినతి ఆర్గానిక్స్‌, వెల్‌స్పన్‌ కంపెనీలను ఎడెల్వీజ్‌ సూచించింది. 



You may be interested

ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పరిమితికి మించి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా?

Wednesday 5th December 2018

పన్ను మినహాయింపులు కల్పించే ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి ఇన్వెస్టర్లకు తెలియంది కాదు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ నిబంధన కింద ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. బేసిక్‌ పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలకు ఇది అదనం. అయితే, రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఇంకా

హెచ్‌యూఎల్‌ షేరును ఏంచేద్దాం..?

Tuesday 4th December 2018

ముంబై: హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) షేరు ధర మంగళవారం ఒకదశలో రూ.1,848.95 వద్దకు చేరుకుని జీవితకాల గరిష్టస్థాయిని తిరగరాసింది. అయితే, మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.15 (0.80 శాతం) నష్టపోయి రూ.1,811 వద్ద ముగిసింది. గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌కు (జీఎస్‌కే) డీల్‌ ప్రకటన అనంతరం షేరు ధర ఎగసినప్పటికీ.. లాభాల స్వీకరణ కారణంగా ఒక శాతం మేర నష్టాలను నమోదుచేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌యూఎల్‌ షేరుపై మార్కెట్‌ విశ్లేషకులు

Most from this category