STOCKS

News


పసిడి ర్యాలీకి బ్రేక్‌లు?

Monday 25th February 2019
Markets_main1551069845.png-24315

  • పసిడి ర్యాలీకి బ్రేక్‌లు?
  • వాణిజ్య చర్చలు, ఫెడ్‌ ధోరణి కీలకం

న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధానికి సంబంధించి అమెరికా, చైనా మధ్య సంధి కుదిరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పసిడి ర్యాలీకి కాస్త బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదాల పరిష్కార చర్చల్లో గణనీయంగా పురోగతి ఉందని, త్వరలో ఒక ఒప్పందం కుదరవచ్చని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, అటు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రకటించడంతో ఈక్విటీలు ర్యాలీ చేయడం, పసిడి జోరు కొంత తగ్గడం ఈ అంచనాలకు ఊతంగా నిలుస్తున్నాయి. ఇక, ఈ వారంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌ అమెరికా హౌస్ కమిటీకి వడ్డీ రేట్ల తీరుతెన్నుల గురించి వివరించనుండటం కూడా బంగారం రేట్లపై ప్రభావం చూపవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి వడ్డీ రేట్ల పెంపునకు విరామం ఇచ్చిన ఫెడ్.. అంతర్జాతీయ వృద్ధికి రిస్కులు తగ్గుతున్న నేపథ్యంలో ధోరణి మార్చుకోవచ్చని అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ వారం వాణిజ్య యుద్ధ భయాలు, ఫెడరల్ రిజర్వ్ ధోరణి బంగారం ధరలకు దిశా నిర్దేశం చేయనున్నాయి. గత వారం అంతర్జాతీయంగా పసిడి రేటు ఔన్సుకు (31.1 గ్రాములు) పది నెలల గరిష్టం 1,341 డాలర్ల స్థాయిని తాకినప్పటికీ, ఆ తర్వాత కొంత వెనక్కి తగ్గింది. 
    మరోవైపు, దేశీయంగా గతవారం పసిడి రేట్ల జోరు కొనసాగింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో స్థానిక జ్యుయలర్ల కొనుగోళ్ల ఊతంతో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మరో రూ. 140 పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా ఇందుకు కొంత దోహదపడింది. వారాంతంలో మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ. 34,830 వద్ద, ఆభరణాల బంగారం రేటు రూ. 34,680 వద్ద ముగిశాయి. వెండి కిలో ధర రూ. 250 పెరిగి రూ. 41,500 వద్ద క్లోజయ్యింది.



You may be interested

ఈ రెండు షేర్లను కొనవచ్చు

Monday 25th February 2019

నాల్కో        కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌  ప్రస్తుత ధర: రూ.49 టార్గెట్‌ ధర: రూ.69 ఎందుకంటే: నాల్కో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కొన్ని అంశాల్లో అంచనాలను మించాయి. అయితే ఉత్పత్తి వ్యయాలు పెరగడం కొంత నిరాశపరిచింది. ఈ క్యూ3లో రూ.620 కోట్ల ఎబిటా రాగలదని అంచనా వేశాం. కానీ ఈ కంపెనీ రూ.510 కోట్ల ఎబిటానే సాధించింది. వార్షికంగా చూస్తే, ఎబిటా 10 శాతం పెరిగినా,

బీమా పాలసీ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి

Monday 25th February 2019

బీమా పాలసీ తీసుకోవడంలో ఎన్నో జాగ్రత్తలు కవరేజీ సరిపడా ఉండాలి వ్యక్తిగత వివరాలు, నామినీ వివరాలు పక్కాగా ఉండాలి బీమా రక్షణను పెట్టుబడిగా చూడొద్దు టర్మ్‌ప్లాన్‌లో ఎక్కువ కవరేజీ మైనర్‌ పేరిట పాలసీ సరికాదు కుటుంబానికి ఆధారమైన వారి పేరిటే తీసుకోవాలి ఓ వ్యక్తి జీవితానికి, అతనిపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థికపరమైన రక్షణ, భరోసాను కల్పించేది బీమా పాలసీ. ఆర్జనా పరులు, మరొకరికి ఆధారమైన వారు ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడం తప్పనిసరి బాధ్యతలో ఒక్కటి. అయితే, జీవిత బీమా

Most from this category