News


ఈ ఏడాది 78 స్థాయికి రూపాయి

Thursday 7th February 2019
Markets_main1549522992.png-24067

  • ఆర్థిక సేవల కంపెనీ కార్వీ విశ్లేషణ
  • బంగారం, వెండిలకు మరింత మెరుపు!

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది 78 స్థాయిని చూసే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ కార్వీ తెలియజేసింది. ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్ లోటులు దీనికి ప్రధాన కారణం కానున్నాయని సంస్థ తన వార్షిక కమోడిటీ, కరెన్సీ నివేదికలో పేర్కొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు సైతం ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా కార్వీ కమోడిటీస్‌ అండ్‌ కరెన్సీల విభాగం సీఈఓ రమేశ్‌ వరకేద్కర్‌ తెలిపారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- 68- 69.50 శ్రేణి బేస్‌గా 73.70- 74.50 శ్రేణి కనిష్ట స్థాయికి రూపాయి చేరవచ్చు. ఈ స్థాయి కిందకు పడితే, ఖచ్చితంగా ఇదే ఏడాది రూపాయి 78 దిశగా పతనం అయ్యే అవకాశం ఉంది.
- ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితంపై తీవ్ర అనిశ్చితి ఉంటుంది. అందువల్ల అటు విదేశీ వ్యవస్థాగత ఇన్వెస్టర్లు ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులకు తక్షణం దూరంగా ఉండే వీలుంది.
- 2017-18  పూర్థి ఆర్థిక సంవత్సరంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 48.72 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచే నాటికే ఈ విలువ 34.94 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇదే విధంగా రెండవ ఆరునెలల గణాంకాలూ నమోదయితే, క్యాడ్‌ దేశానికి తీవ్ర భారంగా తయారయ్యే అవకాశం ఉంది.
- ఒపెక్‌, రష్యాలు తమ ఉత్పత్తుల కోత నిర్ణయం తీసుకుంటే, క్రూడ్‌ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
- వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయంగా వృద్ధి భయాల వల్ల కాపర్‌, అల్యూమినియంసహా బేస్‌మెటల్ ధరలు బలహీనంగానే ఉంటాయి.
- సరఫరాల సమస్యల వల్ల పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది.
- అధిక పంట దిగుబడుల వల్ల సొయాబీన్‌ మార్కెట్‌లో ఈ ఏడాది రెండవ భాగంలో అమ్మకాలు ఒత్తిడి ఉండే వీలుంది.
- తక్కువ దిగుబడివల్ల జీర, చిక్కుడు ధరలు  సానుకూలంగా ఉండవచ్చు.You may be interested

రాయల్టీపై జుబిలంట్‌ ప్రమోటర్లు వెనక్కి

Thursday 7th February 2019

సాయంత్రం నిర్ణయం... రాత్రి ఉపసంహరణ వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావటం వల్లే న్యూఢిల్లీ: డామినోస్‌ పిజ్జా ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ ప్రమోటర్లు... తమ సంస్థకు వచ్చే మొత్తం ఆదాయంలో 0.25 శాతాన్ని రాయల్టీగా తమకు చెల్లించాలన్న ప్రతిపాదనపై వెనక్కి తగ్గారు. డామినోస్‌ బ్రాండ్‌పై పిజ్జా ఔట్‌లెట్లు నిర్వహిస్తోంది కనక​ఈ సంస్థ తమ మొత్తం ఆదాయంలో కొంత శాతాన్ని ఇప్పటికే అంతర్జాతీయ సంస్థయిన డామినోస్‌ బ్రాండ్‌ యాజమాన్యానికి రాయల్టీ రూపంలో

కొనే సంస్థల అభీష్టం మేరకే..!

Thursday 7th February 2019

మా వాటాలో మెజారిటీ అడిగినా ఇచ్చేస్తాం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోటర్ల వెల్లడి న్యూఢిల్లీ: రుణ భారం తగ్గించుకునే క్రమంలో అవసరమైతే కంపెనీలో 50 శాతానికి పైగా వాటా విక్రయించడానికి కూడా జీ ఎంటర్‌టైన్‌మెంట్ (జీ) ప్రమోటర్లు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఇద్దరు ఇన్వెస్టర్లతో ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ఎండీ పునీత్ గోయెంకా చెప్పారు. డీల్‌ కుదుర్చుకునేందుకు మార్చి- ఏప్రిల్ దాకా కంపెనీ డెడ్‌లైన్ విధించుకున్నట్లు తెలియజేశారు. "మా ఉద్దేశంలో ఎలాంటి

Most from this category