News


పటిష్టంగా పసిడి..

Monday 18th February 2019
Markets_main1550480695.png-24246

  • మాంద్యం, డాలర్‌ భయాలతో మరింత పెరిగే అవకాశాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మరోసారి మాంద్యం ముప్పు భయాలు, డాలర్ ర్యాలీకి ఇక బ్రేక్ పడొచ్చన్న అంచనాలు పసిడికి ఊతమివ్వొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. డాలర్‌ బలంగా ఉన్న పరిస్థితుల్లో కూడా పసిడి రేట్లు పటిష్టంగానే కొనసాగుతుండటం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. బంగారం రేట్ల పెరుగుదల మరీ దూకుడుగా లేకపోయినప్పటికీ.. వారాంతంలో కీలకమైన 1300 డాలర్ల ధర (ఔన్సుకి - 31.1 గ్రాములు) పైన ముగియడం సానుకూల అంశంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. "ఇప్పటికే తారస్థాయికి చేరిన అమెరికా డాలర్‌ ర్యాలీకి ప్రతికూలంగా పలు అంశాలు ఉన్నాయి. మరోసారి మాంద్యం ముప్పు పొంచి ఉందన్న భయాలు పెరుగుతుండటం, తయారీ రంగ గణాంకాలు బలహీనంగా ఉండటం, వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ ఇప్పుడప్పుడే పెంచకపోవచ్చన్న అంచనాలు మొదలైనవి వీటిలో ఉన్నాయి" అని కామర్జ్‌ బ్యాంక్ కమోడిటీ రీసెర్చ్ విభాగం హెడ్ యూజీన్ వెయిన్‌బర్గ్ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా పసిడికి కలిసి రాగలవని అభిప్రాయపడ్డారు. అయితే, కీలకమైన 1,300 డాలర్ల స్థాయిని నిలబెట్టుకుంటున్నప్పటికీ, మరింత పెరగాలంటే 1,320 డాలర్ల మద్దతు స్థాయిని దాటాల్సి ఉంటుందని ఎస్‌ఐఏ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ కొలిన్‌ పేర్కొన్నారు. ఒకవేళ దాన్ని దాటి నిలవగలిగితే తదుపరి దీర్ఘకాల నిరోధం 1,360 డాలర్ల దాకా వెళ్లొచ్చని వివరించారు.
    దేశీ మార్కెట్ల విషయానికొస్తే.. వారాంతం శుక్రవారం నాడు న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పసిడి ధర రూ. 310 మేర పెరిగింది. అంతర్జాతీయ ధోరణులకి దేశీయంగా జ్యుయలర్ల నుంచి డిమాండ్ కూడా తోడవడం ఇందుకు కారణం. మేలిమి బంగారం ధర రూ. 34,310 వద్ద, ఆభరణాల బంగారం రేటు రూ. 34,160 వద్ద క్లోజయ్యింది. అటు పరిశ్రమల నుంచి డిమాండ్‌తో వెండి రేటు కూడా కేజీకి రూ. 170 చొప్పున పెరిగి రూ. 40,820 వద్ద ముగిసింది. You may be interested

ఆర్‌బీఐ హెచ్చరిక: యస్‌ షేర్ల పతనం

Monday 18th February 2019

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరికతో యస్‌ బ్యాంక్‌ షేర్లు సోమవారం 8శాతం నష్టపోయాయి. యస్ బ్యాంక్‌కు సంబంధించి 2017-18లో ఆస్తుల వర్గీకరణ, కేటాయింపుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఆర్‌బీఐ గతవారం ధ్రువీకరించింది. రహస్యంగా ఉంచాల్సిన ఆర్‌ఏఆర్‌ నివేదికను యస్ బ్యాంక్‌ను బహిర్గతం చేసింది. ఇది నిబంధనలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని, అందుకు తగిన చర్యలు తర్వలో తీసుకుంటామని ఆర్‌బీఐ యస్‌ బ్యాంక్‌ను హెచ్చరించింది. ఆర్‌బీఐ హెచ్చరికత

ఎఫ్‌ఎమ్‌జీసీ షేర్లలో అమ్మకాలు

Monday 18th February 2019

మార్కెట్‌ నష్టాల్లో భాగంగా ఎఫ్‌ఎంజీసీ(ఫాస్ట్‌-మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌ అత్యధికంగా 1.50శాతం పతనమైంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐటీసీ, హిందూస్థాన్‌ యూనిలివర్‌ 1.50శాతం పతనం ఇం‍డెక్స్‌ నష్టపోవడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(29,309.10)తో పోలిస్తే 1.00శాతం క్షీణించి 29,002 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి

Most from this category