STOCKS

News


65 డాలర్ల వద్ద బ్రెంట్‌ క్రూడ్‌

Wednesday 10th July 2019
Markets_main1562732310.png-26935

అమెరికా చమురు నిల్వలు వరుసగా నాలుగో వారం కూడా పడిపోవడంతో బుధవారం(జులై 10) చమురు ధరలు 1 శాతం మేర పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.1 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.85 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 58.73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 31 లక్షల బ్యారెల్లా చమురు నిల్వలు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తే అది 81 లక్షల బ్యారెల్లు తగ్గి 4,614 లక్షల  బ్యారెల్‌కు చేరిందని అమెరికా పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌ మంగళవారం తెలిపింది. కానీ గత ఏడాది రోజువారి ఉత్పత్తి(బీపీడీ) 109.6 లక్షల బ్యారెల్‌ ఉంటే అది ఈ ఏడాది 123.6 లక్షల బ్యారెల్‌కు పెరిగిన విషయం గమనర్హం. ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తి కోత కాల పరిమితిని పెంచడంతో పాటు మధ్యప్రాచ్య దేశాలలో ఉద్రిక్తతల వలన 2019లో బ్రెంట్‌ క్రూడ్‌ 20 శాతం మేర పెరిగింది.  



You may be interested

మార్కెట్‌ను మెప్పించని టీసీఎస్‌ ఫలితాలు

Wednesday 10th July 2019

3శాతం పతనమైన షేర్లు ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటికీ.., బుధవారం ఈ కంపెనీ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ క్యూ1 ఫలితాలు విడుదల చేసింది. రూపాయి బలపడటం, వేతనాల పెంపు, ఉద్యోగుల వలసల తదితర ప్రతికూలాంశాలతో నిర్వహణ మార్జిన్లు, ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. అయితే నికరలాభం మాత్రం అంచనాలకు

టీసీఎస్‌ ఎఫెక్ట్‌..నెగిటివ్‌ ప్రారంభం

Wednesday 10th July 2019

ఐటీ దిగ్గజం, ఇండెక్స్‌ హెవీవెయిట్‌ టీసీఎస్‌ 2.5 శాతం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభంకావడంతో బుధవారం స్టాక్‌ సూచీలు నెగిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్ల క్షీణతతో 38,700 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల క్షీణతతో 11,536 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు టీసీఎస్‌ ప్రకటించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి లోనుచేయడంతో ఈ షేరు 2.5 శాతం క్షీణతతో  రూ. 2,080 వద్ద మొదలయ్యింది. బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌,

Most from this category