STOCKS

News


చల్లారిన చమురు ధరలు

Wednesday 24th October 2018
Markets_main1540364093.png-21440

ప్రపంచమార్కెట్లో ముడిచమురు ధరలు మంగళవారం ఒక్కరోజులోనే 4శాతం వరకు పతనమయ్యాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో తాజాగా సౌదీ అరేబియా తగినంత చమురును ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్‌ రోజుకు ఏడు లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఇప్పటికే తగ్గిపోగా.. వచ్చేనెల 4 నుంచి అమెరికా రెండో విడత ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో  వచ్చే ఏడాదికల్లా ఇరాన్‌ చమురు ఉత్పత్తి మరో 9 లక్షల బ్యారెళ్లు (రోజుకు) తగ్గిపోనుంది. అత్యధిక చమురు నిల్వలు ఉన్న సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచకపోతే ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు అవసరమైన చమురును సరఫరా చేసేందుకు అమెరికా ప్రఖ్యాత జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గీ మరణాన్ని అడ్డుపెట్టుకుని సౌదీ అరేబియా చేత ‘‘తగినంత చమురు ఉత్పత్తిని చేస్తామంటూ’’ అమెరికా ప్రకటింపచేసిందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పతనమైనమయ్యాయి. ఫలితంగా లండన్‌ మార్కెట్లో మంగళవారం బ్రెంట్‌ బ్యారల్‌ ధర 4.3శాతం (3.39డాలర్లు)76.4 డాలర్లకి క్షీణించింది. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 76.75 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

పాపులారిటీకి ఫలితమే ప్రస్తుత పతనం!

Wednesday 24th October 2018

వర్దమాన మార్కెట్లలో ఎక్కువ విదేశీ నిధులు ఆకర్షించిన భారత్‌ అదేజోరుతో కొనసాగుతున్న నిధుల ఉపసంహరణ దేశీసూచీల్లో మరింత కరెక‌్షన్‌కు ఛాన్స్‌ భారత్‌లో వర్షాకాలం ముగిసింది కానీ భారతీయ మార్కెట్లో కరెక‌్షన్‌ తుఫాన్‌ ఆరంభమైంది. ఆగస్టు అనంతరం దేశీయ సూచీలు భారీగా క్షీణిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ తన కీలక డీఎంఏ స్థాయిలకు చాలా దిగువన ట్రేడవుతోంది. ఇప్పటికీ సూచీలకు బలమైన మద్దతు స్థాయి లభించడం లేదని పేలవ పుల్‌బ్యాక్స్‌ నిరూపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా భారత

మంచి ‘ఫండ్స్‌’ ఎంపికకు వీటిని చూడాల్సిందే

Wednesday 24th October 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా సిప్‌ మార్గంలోకి ఎక్కువ మంది అడుగుపెడుతున్నారు. మరి వందలాది ఫండ్స్‌ పథకాల్లో ఎంపిక ఆచితూచి ఉంటేనే, రాబడులు అంత మెరుగ్గా ఉంటాయని మర్చిపోవద్దు. ఎంత కాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తారు, పథకంలో ఉండే రిస్క్‌ స్థాయి ఇలా ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది.  పనితీరు, పోటీ పథకాలతో సమీక్ష ఓ పథకం రాబడులన్నవి... ప్రారంభ ఎన్‌ఏవీ ధర, ముగింపు

Most from this category