News


60 డాలర్ల దిగువకు క్రూడ్‌

Thursday 13th June 2019
Markets_main1560403239.png-26261

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గురువారం స్థిరంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్‌ 0.2శాతం పెరిగి 60.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ క్రూడ్‌ బుధవారం 3.7శాతం కోల్పోయి ఐదు నెలల కనిష్ఠమైన 59.97 డాలర్లకు పడిపోయింది. అమెరికా క్రూడ్‌ నిల్వలు పెరగడంతో పాటు మందగమనం కారణంగా డిమాండ్‌ తగ్గడంతో గత సెషన్‌లో 4 శాతం మేర నష్టపోయాయి. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర కూడా 0.2 శాతం పెరిగి 51.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది గత సెషన్లో 4శాతం కోల్పోయి బ్యారెల్‌ 51.14 డాలర్ల వద్ద ముగిసింది. గత వారం విశ్లేషకులు యూఎస్‌ ఇన్వెంటరీ 481,000 బ్యారెల్స్‌కు తగ్గుతుందని అంచనా వేశారు. కానీ అకస్మాత్తుగా 2.2 మిలియన్ల బ్యారెల్‌ క్రూడ్‌ నిల్వలు పెరగాయని ది యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిష్ట్రేటర్‌(ఈఐఏ) తెలిపింది. యూఎస్‌ వాణిజ్య నిల్వలు గత ఐదు సంవత్సరాల సరాసరి కన్నా 8 శాతం అధికంగా ఉన్నాయి.  2019 ప్రపంచ ఆయిల్‌ డిమాండ్‌ పెరుగుదల అంచనాలను ఈఏఐ  మంగళవారం తగ్గించింది.
   ప్రపంచ ఆర్థిక వ్వవస్థలోని భయాల కారణంగా రిస్క్‌చేసే ఫండ్‌ మేనెజర్‌లు ఆయిల్‌ పోజిషన్‌ల నుంచి బయటకి రావడం 2018 నాలుగవ త్రైమాసికం నుంచి పెరుగుతోంది. అనిశ్చితలో ఉన్న స్థూల ఆర్థిక వ్యవస్థ కారణంగా ఒపెక్‌ సరఫరాను తగ్గించే అవకాశం ఉందని గోల్డ్‌మాన్‌ సాక్స్‌ వివరించింది. జూన్‌ చివరిలో ఒపెక్‌ సమావేశం అవుతుండడంతో సరఫరా, ఉత్పత్తి కోతలను పొడిగిస్తారా? అనే అంశంపై మార్కెట్‌లు దృష్టి పెట్టే అవకాశం ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలను పెంచడంలో భాగంగా ఈ ఏడాది ఒపెక్‌ దేశాలతో పాటు, రష్యా కూడా తమ రోజువారి ఆయిల్‌ ఉత్పత్తిని 1.2 మిలియన్‌ బ్యారెల్‌కు తగ్గించాయి. ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి కోతలను పొడిగించే అవకాశం ఉందని యునిటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌ ఎనర్జి మినిస్టర్‌ సుహాలి బిన్‌ మహమద్‌ ఆల్‌ మజ్రోయి మంగళవారం అన్నారు.



You may be interested

హోండా నుంచి ప్రీమియం యాక్టివా125

Thursday 13th June 2019

న్యూఢిల్లీ, సాక్షి బిజినెస్‌ బ్యూరో:- వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన న్యూ ప్రీమియం యాక్టివా 125ను హోండా బుధవారం ఆవిష్కరించింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికం నుంచి దీని అమ్మకాలను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నుంచి ఉత్పత్తి చేస్తున్న తొలి బీఎస్‌-6 అనుగుణ ద్విచక్రవాహనం ఇదేనని తెలిపింది. దీని ధర బీఎస్‌4 యాక్టివా స్కూటర్‌ కన్నా 10- 15 శాతం ఎక్కువ ఉంటుందని

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 13th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు  టాటా మోటర్స్‌:- అంతర్జాతీయంగా మేనెలలో అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గతేడాది మేలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 23 శాతం 82,374 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే నెలలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 39,895 యూనిట్లుగా ఉన్నాయి. సెయిల్‌:- నష్టాల్లో ఉన్న యూనిట్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.  హెచ్‌సీసీ:- జూన్‌ 17న జరిగే బోర్డు సమావేశంలో నిధుల సమీకరణ ప్రతిపాదనుకు షేర్లు హోల్డర్లు ఆమోదం

Most from this category