News


క్రూడాయిల్‌ నేల చూపులు

Saturday 15th December 2018
Markets_main1544872857.png-22974

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 60.28 డాలర్లకు దిగివచ్చింది. ఒపెక్‌, దాని మిత్ర దేశాలు ఉత్పత్తిలో కోత విధిస్తామని ప్రకటించినా క్రూడాయిల్‌ ధరలో జోరు రాలేదు. యూఎస్‌ షేల్‌గ్యాస్‌ ఉత్పత్తి పెరగడంతో ఒపెక్‌ కోత ప్రభావం ఉండదని, అందువల్ల వచ్చే ఏడాది డిమాండ్‌ పెద్దగా పెరగకపోవచ్చని ట్రేడర్లు భావించడంతో క్రూడాయిల్‌ ధర పెరగలేదు. పైగా గత వారంతో పోలిస్తే ఒక డాలర్‌ తగ్గింది. రోజూవారి ఉత్పత్తిలో 12 లక్షల బ్యారెళ్లను తగ్గిస్తామని గతవారం ఒపెక్‌ ప్రకటించింది. ఇందుకు తగ్గట్లే యూఎస్‌కు సౌదీ ఉత్పత్తులు వచ్చే నెల నుంచి తగ్గనున్నాయి.

చమురు మార్కెట్లు ప్రస్తుతానికి పెద్దగా కోత విషయమై భయపడట్లేదు. మరోపక్క యూఎస్‌ షేల్‌ ఉత్పత్తి రోజురోజుకీ  పెరిగిపోతున్నందున చమురు మార్కెట్‌ ఎటువైపు కదులుతుందో చెప్పలేకపోతున్నామని నిపుణులు వివరిస్తున్నారు. ఒపెక్‌ కోత అమల్లోకి రావడం జరిగిన తర్వాత ఒక అంచనాకు రావచ్చంటున్నారు. నిజానికి ఒపెక్‌ కోత ప్రభావం చుమరు అతిసరఫరాపై పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒపెక్‌ సభ‍్యదేశాల్లో సంభవించే అనుకోని వైఫల్యాలు సంస్థ ఉద్దేశాన్ని నీరుగారుస్తాయని ఐఏఈ హెచ్చరించింది. ఇప్పటికైతే షేల్‌ ఉత్పత్తి జోరుగా ఉన్నందున క్రూడాయిల్‌ ధరలో ర్యాలీ ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ వారం డబ్ల్యుటీఐ క్రూడాయిల్‌ ధర 52 డాలర్లకు పడిపోయింది. టెక్నికల్‌గా పరిశీలిస్తే ఇటీవల కాలంలో క్రూడ్‌ ధర వేగంగా 30 శాతం వరకు పడిపోయినందున కొంత పుల్‌బ్యాక్‌ ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 



You may be interested

పెట్టుబడి నిరంతర ప్రక్రియ!

Saturday 15th December 2018

ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది ఒకసారి చేసి అపే ప్రక్రియ కాదు. మన మనుగడ బాగుండాలంటే నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగించాలి. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని గుర్తించి పెట్టుబడి ప్రక్రియను మరవకుండా కొనసాగించాలి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌కు లక్ష్యం తప్పనిసరి. లక్ష్యం లేకుంటే ఎంత కాలం మదుపు చేయాలి, ఎంత మొత్తం చేయాలన్న స్పష్టత ఉండదు. భవిష్యత్తు అవసరాలే లక్ష్యం అయితే ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా అధిక రాబడులను అందుకోవచ్చు. అదే స్వల్ప

వడ్డీరేట్ల తగ్గింపు తప్పదు!

Saturday 15th December 2018

క్రిస్‌ వుడ్‌ అంచనా ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ నియామకంతో ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో సడలింపులు కనిపించవచ్చని సీఎల్‌ఎస్‌ఏ వ్యూహకర్త క్రిస్‌వుడ్‌ అభిప్రాయపడ్డారు. దీంతో ఇకపై వడ్డీరేట్ల తగ్గింపు దిశగా ఎంపీసీ నిర్ణయాలు ఉండొచ్చన్నారు. మరోపక్క కన్జూమర్‌ ప్రైస్‌ ద్రవ్యోల్బణం తగ్గడం కూడా రేట్ల తగ్గింపునకు అవకాశమిస్తుందని చెప్పారు. నవంబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 2.3 శాతానికి దిగివచ్చింది. తాజా గణాంకాలతో రేట్ల విషయంలో ఆర్‌బీఐ మరీ కఠినంగా ఉంటోందన్న అంచనాలున్నాయన్నారు. ద్రవ్యోల్బణం తగ్గినందున

Most from this category