STOCKS

News


దిగుమతులు తగ్గించడానికే పసిడిపై సుంకం పెంపు

Tuesday 9th July 2019
Markets_main1562651177.png-26914

  • రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే

న్యూఢిల్లీ: దేశంలోకి అవసరేతర దిగుమతులు తగ్గించాలన్న విధానంలో భాగంగానే 2019-20 బడ్జెట్‌లో పసిడిపై సుంకాన్ని 10  శాతం నుంచి 12.5 శాతానికి పెంచినట్లు రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే పేర్కొన్నారు. సుంకాల పెంపు వల్ల ఇప్పటికే తీవ్రంగా ఉన్న పసిడి అక్రమ దిగుమతులు, రవాణా మరింత తీవ్రమవుతాయని వ్యక్తమవుతున్న ఆందోళనలను రెవెన్యూ కార్యదర్శి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఇలాంటి చర్యల నిరోధానికి తగిన అన్ని చర్యలనూ తీసుకుంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిస్థితులు, ప్రయోజనాల ప్రాతిపదికన విధాన నిర్ణయాలు ఉంటాయితప్ప, ఒకరి అభిప్రాయాలు, ఉద్దేశాల ప్రకారం ఉండబోవనీ ఆయన స్పష్టం చేశారు. అవసరేతర దిగుమతులకు విదేశీ కరెన్సీని వినియోగించకూడదన్నది ప్రభుత్వ విధానమని తెలిపారు. పసిడిపై దిగుమతి సుంకం పెంపు వల్ల ఈ విభాగంలో బ్లాక్‌ మార్కెటింగ్‌ 30 శాతం పెరుగుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో ఆభరణాల ధర మరింత తీవ్రమయ్యే అవకాశమూ ఉందన్న విశ్లేషణలూ ఉన్నాయి. దీనితో  తక్షణం కస్టమ్స్‌ సుంకం తగ్గింపును కోరుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో  సమావేశం కావాలని ఆభరణాల వర్తకుల సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. అఖిలభారత రత్నాలు, ఆభరణాల దేశీయ​ మండలి (ఏఐజీజేడీసీ) చైర్మన్‌ బడ్జెట్‌ సుంకాల పెంపు నిర్ణయంపై మాట్లాడుతూ,  పెరిగిన కస్టమ్స్‌ సుంకం, దీనికితోడు జీఎస్‌టీ వెరసి ధరలు 15.5 శాతం పెరిగుతాయని విశ్లేషించారు. ఇప్పటికే దేశంలో పసిడి స్మగ్లింగ్‌ ఎక్కువగా ఉందని,  పసిడి స్మగ్లింగ్‌ ద్వారా 4 నుంచి 5 శాతం డిస్కౌంట్‌ లభించే వీలుండడం కస్టమర్లను ఈ దిశగా ఆకర్షిస్తుందని పేర్కొన్నారు.  బ్లాక్‌ మార్కెటింగ్‌ 30 శాతం వరకూ పెరిగే ఆవకాశం ఉందని అంచనావేశారు.



You may be interested

ఎయిరిండియా ప్రైవేటీకరణ ఒప్పుకోం

Tuesday 9th July 2019

చైర్మన్‌తో భేటీలో ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ ముంబై: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు నెలకొన్న దరిమిలా యాజమాన్యానికి తమ ఆందోళన గురించి తెలియజేశాయి. ప్రైవేటీకరణ ప్రణాళికపై సోమవారం చైర్మన్‌ అశ్వనీ లోహానీతో జరిగిన సమావేశంలో 13 ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు

1400 డాలర్ల దిగువకు పసిడి

Tuesday 9th July 2019

డాలర్‌ బలపడటంతో పాటు ట్రేడర్ల అప్రమత్తతతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1400 డాలర్ల దిగువకు చేరుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల నష్టంతో 1,398.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమి పావెల్‌తో పాటు 10 మంది యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంకుర్లు  అమెరికా కాంగ్రెస్‌ ఎదుట చేసే ప్రసంగంపై ట్రేడర్లు దృష్టిని సారించారు. ముఖ్యంగా వడ్డీరేట్ల కోతపై వారు ఎలాంటి సంకేతాలు ఇస్తారోనని

Most from this category