STOCKS

News


1300 డాలర్ల పైనే పసిడి

Tuesday 29th January 2019
Markets_main1548741934.png-23870

అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతల అండతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల పైన ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 0.05 స్వల్ప పెరుగుదలతో 1,303.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించిన కేసులో చైనా దేశపు హువాయ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సీఎఫ్‌ఓతో పాటు మరో ఇద్దరు అధికారులపై అమెరికా న్యాయ విభాగం చార్జ్‌షీట్‌ ధాఖలు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల సఫలంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూరోజోన్‌ బ్రెగ్జిట్‌ సంక్షోభ సెగలు చల్లారకపోవడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు పెరిగింది. అలాగే ఈసారి ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లపై తటస్థ విధానాన్ని అవలభింస్తుందనే అంచనాలతో డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో 2వారాల కనిష్టానికి చేరుకోవడం సైతం పసిడికి మద్ధతినిస్తుంది. ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు, డాలర్‌ బలహీనత తదితర అంశాలతో పసిడి ధర ఆగస్ట్‌ నుంచి 20శాతం పెరిగింది.
దేశీయంగానూ స్థిరంగా:-
దేశీయ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. మంగళవారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.20.00లు పెరిగి 32567.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం రోజు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ భారీపతనం కారణంగా ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఎంసీఎక్స్‌లో ధర దాదాపు రూ.224ల లాభపడి రూ.32547ల వద్ద ముగిసింది.



You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతం అప్‌

Tuesday 29th January 2019

6.50శాతం ర్యాలీ చేసిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత రెండు ట్రేడింగ్‌లో నష్టాల్లో ముగిసిన ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా  ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీకెల్లా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.50శాతం పెరిగింది. ఉదయం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,903.55)తో పోలిస్తే 2శాతం లాభంతో 2,962.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రొవిజనింగ్‌ సెగ

Tuesday 29th January 2019

- క్యూ3లో రూ. 4,738 కోట్లకు ఎగిసిన నష్టాలు ముంబై: మొండిబాకీలకు కేటాయింపులు రెట్టింపు కావడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నష్టాలు మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 4,738 కోట్లకు ఎగిశాయి. 40 భారీ మొండి పద్దులపై దివాలా చట్టం కింద విచారణ జరుగుతుండటం, కొత్తగా ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం రూపంలో మొండిబాకీలు మరింతగా పెరగడం ఇందుకు కారణం. భారీ మొండిబాకీల కారణంగా ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత

Most from this category