STOCKS

News


స్థిరంగా పసిడి ధర

Wednesday 3rd April 2019
Markets_main1554274297.png-24943

పసిడి 4రోజు పతనానికి బుధవారం బ్రేక్‌ పడింది. డాలర్‌ బలహీనతతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మంగళవారం ఔన్స్‌ పసిడి ధర 1.85డాలర్లు పెరిగి 1,297.25డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా - అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతుండటం, యూరోజోన్‌ బ్రెగ్జిట్‌ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఈక్విటీ మార్కెట్ల స్థిరమైన ర్యాలీతో డాలర్‌ ఇండెక్స్‌పై ఒత్తిడి నెలకొంది. దీంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97.14 కనిష్టస్థాయికి దిగివచ్చింది. డాలర్‌ బలహీనత కారణంగా పసిడి ధర నష్టాల నుంచి తేరుకుని 1,297.25 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్‌ మిశ్రమ ముగింపు నేపథ్యంలో అక్కడి మార్కెట్లో పసిడి 1,297.55డాలర్ల వద్ద ముగిసింది. 
దేశీయంగానూ స్థిరంగానే:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఏప్రిల్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.10లు నష్టపోయి రూ.31500.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాల‌ర్ మార‌కంలో రూపాయి 40పైస‌లు బలపడిన నేపథ్యంలో 10గ్రాముల పసిడి ధర రూ.36లు లాభ‌పడి రూ.31490.00ల వ‌ద్ద ముగిసింది. 



You may be interested

24 స్టాకులపై బడా బ్రోకరేజ్‌ల మోజు

Wednesday 3rd April 2019

మార్కెట్లో నెలకొన్న పాజిటివ్‌మూడ్‌తో పలు అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థలు ఇండియా రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం, మార్కెట్‌ టార్గెట్‌ను పెంచడం చేస్తున్నాయి. బీఎన్‌పీ పారిబా సెన్సెక్స్‌ టార్గెట్‌ను 42వేల పాయింట్లకు, గోల్డ్‌మన్‌ సాక్స్‌ నిఫ్టీ టార్గెట్‌ను 12500 పాయింట్లకు పెంచాయి. దీంతో పాటు ఈ దిగ్గజ బ్రోకరేజ్‌లు పలు వైయుక్తిక స్టాకులపై పాజిటివ్‌గా ఉన్నాయి.  బీఎన్‌పీ పారిబా:  - యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐషర్‌ మోటర్స్‌, మారుతీ సుజుకీ, టైటాన్‌,

నిఫ్టీ రికార్డు

Wednesday 3rd April 2019

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో సూచీల రికార్డు పర్వం కొనసాగుతూనే ఉంది. నేడు నిఫ్టీ ఇండెక్స్‌ 48 పాయింట్లు లాభపడి 11,761.00 వద్ద కొత్త జీవితకాలపు గరిష్టస్థాయిని నమోదు చేసింది. అలాగే మరో ప్రధాన సూచీ సెనెక్స్‌ సైతం 211 పాయింట్లు లాభపడి 39,266.85 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. రెండురోజుల కింద సోమవారం సెన్సెక్స్‌ సూచీ కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు సంగతి తెలిసిందే. అలాగే ప్రభుత్వ రంగ

Most from this category