STOCKS

News


ఈ ఏడాది కనిష్టం వద్ద పసిడి ధర

Thursday 18th April 2019
Markets_main1555567900.png-25201

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం ఈ ఏడాది కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్థిక మందగమన ఆందోళన భయాలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణం. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌సెషన్‌లో ఔన్స్‌ పసిడి 3డాలర్లు నష్టపోయి 1,273 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల పలు దేశాలు వెల్లడించిన మెరుగైన ఆర్థిక గణాంకాలు అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తగ్గుముఖం పట్టిందనే అంశం స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లిస్తుండంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గింది. పసిడికి సాంకేతిక కీలకమైన మద్దతు 1275డాలర్ల స్థాయిని కోల్పోయింది. ఇప్పుడు 1,265 డాలర్ల స్థాయిని పరిక్షీస్తుంది. ఈ వారంలో పసిడి దర ఏకంగా 1.5శాతం క్షీణించింది. రెగ్యూలేటరీ సమస్యల కారణంగా హెల్త్‌కేర్‌ రంగ షేర్ల పతనంతో రాత్రి అమెరికా మార్కెట్‌ నష్టాల ముగింపు కారణంగా అక్కడి మార్కెట్‌ ఔన్స్‌ పసిడి 5డాలర్లు లాభపడి 1,276.80 వద్ద స్థిరపడింది. 
దేశీయంగానూ స్వల్ప క్షీణత:- 
దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా నష్టపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం పసిడికి ప్రతికూలంగా మారింది. ఎంసీక్స్‌లో ఉదయం సెషన్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.74.00లు క్షీణించి రూ.31406.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 14పైసలు బలపడి 69.46 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఎన్‌డీఏ మళ్లీ వస్తే.. మరింత జోరు!

Thursday 18th April 2019

సీఎల్‌ఎస్‌ఏ అంచనా ఈ దఫా మరోమారు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని దేశీయ మార్కెట్లు క్రమంగా ప్రైస్‌ఇన్‌ చేసుకుంటున్నాయని బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. మార్కెట్‌ అంచనాలు నిజమైతే సూచీల్లో మరింత అప్‌మూవ్‌ ఉంటుందని అంచనా వేసింది. ఈ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, గోద్రేజ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రామ్‌కో, ఆర్‌ఐఎల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌ షేర్లను రికమండ్‌ చేసింది. ప్రస్తుతం ఎఫ్‌ఐఐ, డీఐఐల్లో మార్కెట్‌పై ఆశావహ

నష్టాల్లోకి మళ్ళిన మార్కెట్‌

Thursday 18th April 2019

గురువారం గ్యాప్‌అప్‌తో కొత్త రికార్డుస్థాయిల వద్ద ప్రారంభమైన స్టాక్‌ సూచీలు అరగంటలోనే నష్టాల్లోకి మళ్లాయి. కొద్దిరోజులుగా పెద్ద ర్యాలీ జరిపిన బ్యాంకింగ్‌ షేర్లలో జరుగుతున్న లాభాల స్వీకరణ, మెటల్‌ షేర్లలో అమ్మకాల ఫలితంగా నిఫ్టీ తిరిగి 11,800 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్‌ 38,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఈ రోజు ఉదయం నిఫ్టీ 11,856 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 38,420 పాయింట్ల వద్ద కొత్త గరిష్టస్థాయిల్ని నమోదుచేశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే

Most from this category