STOCKS

News


తగ్గిన పసిడి ధర

Monday 18th March 2019
Markets_main1552896911.png-24667

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్ల మేర నష్టపోయింది. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ సమీక్షా సమావేశాలు ఈవారంలో మంగళ, బుధ వారాల్లో జరగున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగనం కారణంగా ఈసారి ఫెడ్‌ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వడ్డీరేట్ల పెంపు లేకపోతే బాండ్‌, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది. నేడు ఆసియాలో పలు మార్కెట్ల లాభాల్లో కొనసాగుతుండటంతో పాటు చైనా-అమెరికా చర్చల నేపథ్యంలో పసిడి ర్యాలీపై తీవ్ర ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ లాభపడింది. ఈ అంశాలన్ని పసిడి ధరకి ప్రతికూలంగా మారాయి. ఫలితంగా నేటి ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ధర 5డాలర్ల నష్టపోయి 1,298.05 డాలర్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యా్‌హ్నం గం.1:00లకు ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు నష్టపోయి 1299డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా రూ.200లు డౌన్‌:-
అంతర్జాతీయ మార్కెట్‌ ట్రెండ్‌కు తగ్గట్టుగానే దేశీయ మార్కెట్లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపటడటం పసిడికి ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు. మధ్యా్‌హ్నం గం.1:00లకు 10గ్రాముల పసిడి ధర రూ.200లు నష్టపోయి రూ.31634ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మిడ్‌టర్మ్‌ కోసం డజన్‌ సిఫార్సులు

Monday 18th March 2019

మిడ్‌టర్మ్‌ కోసం డజన్‌ సిఫార్సులువచ్చే రెండు మూడు వారాల సమయంలో మంచి రాబడినందించే షేర్లను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు: 1. భెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 75. స్టాప్‌లాస్‌ రూ. 63. ఇటీవలే రూ.71 నుంచి రూ. 66 వరకు పతనమైంది. తాజాగా ట్రెండ్‌ రివర్సల్‌ చూపుతోంది. ప్రస్తుతం 34 వారాల మూవింగ్‌ యావరేజ్‌ స్థాయికి పైన క్లోజయి బలంగా కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ సైతం పాజిటివ్‌ సంకేతాలు

ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ నో?

Monday 18th March 2019

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు పేరు మార్చేందుకు ఆర్‌బీఐ సుముఖంగా లేదని సమాచారం. బ్యాంకు పేరును ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంకుగాను లేదంటే ఎల్‌ఐసీ బ్యాంకుగాను మార్చాలని, ప్రథమ ప్రాధాన్యం ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంకేనని గత నెలలో ప్రతిపాదనలు పంపిన విషయం గమనార్హం. అయితే, ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ అనుకూలంగా లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేరు మార్పునకు ఆర్‌బీఐతోపాటు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ, వాటాదారులు, స్టాక్‌ ఎక్సేంజ్‌ల అనుమతి

Most from this category