News


వారంరోజుల గరిష్టం వద్ద పసిడి

Thursday 13th September 2018
Markets_main1536821365.png-20236

న్యూయార్క్‌:- ప్రపంచ మార్కెట్లో గురువారం పసిడి ధర వారంరోజుల గరిష్టం పైన స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువతో పోలిస్తే డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించడం, అమెరికా 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ పెరగడం ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాలం ఉదయం 11 గంటలకు ఔన్స్‌ పసిడి 1 డాలరు స్వల్పంగా లాభపడి రూ.1,211.90 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
క్షీణించిన డాలర్‌ ఇండెక్స్‌:- అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని రూపుమాపేందుకు మరోసారి చర్చలు జరగవచ్చనే అంచనాలతో పాటు, ఈ అగస్ట్‌ నెలలో అమెరికాలో ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్ 0.1% శాతం క్షీణించడం, డాలర్‌తో పోలిస్తే జపాన్‌ కరెన్సీ యెన్‌ మారకం విలువ  అనూహ్యంగా పుంజుకోవడం తదితర కారణాలతో డాలర్‌ ఇండెక్స్‌ వారం రోజుల కనిష్టానికి పతనమైంది. ఫలితంగా గురువారం డాలర్‌ ఇండెక్స్‌ తనకు సాంకేతికంగా కీలకమైన 95 స్థాయిని కోల్పోయి 94.76 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది
పెరిగిన 10ఏళ్ల అమెరికా బాండ్‌ ఈల్డ్‌:-  ఈ సెప్టెంబర్‌లో జరిగే ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమీక్ష సమావేశంలో ఫెడ్‌ కీలక వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో అమెరికా 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4శాతం పెరిగి పెరిగి 2.969వద్దకు చేరుకుంది. రానున్న రోజుల్లో బాం‍డ్ల కొనుగోళ్లతో 10ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 3.00 స్థాయికి చేరవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.  
-    ఈ రెండు కారణాలు పసిడి వారం రోజుల గరిష్ట ధరను చేరుకునేందుకు దోహదపడ్డాయి.  
-     గతరాత్రి అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల ముగింపు నేపథ్యంలో అక్కడ ఔన్స్‌ పసిడి 1,210.9 డాలర్ల వద్ద ముగిసింది.
నేడు ఎంసీక్స్‌ మార్కెట్‌కు సెలవు:-
వినాయక చతుర్థి సందర్భంగా నేడు ఎంసీక్స్‌ మార్కెట్‌కు సెలవు. అయితే బుధవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెటో 10 గ్రాముల పసిడి స్వల్పంగా నష్టపోయింది. రూపాయి రీకవరి కారణంగా  డాలర్‌ పోలిస్తే రూపాయి మారక విలువ మరింత క్షీణించకుండా ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్థిక వ్యవహారాలు శాఖ మంత్రి సుభాష్‌ చంద్ర గార్గే ప్రకటించడంతో గత ట్రేడింగ్‌ రూపాయి కొత్త కనిష్టస్థాయి(72.91స్థాయి) నుంచి 51 పైసలు బలపడి 72.18 వద్ద ముగిసింది. రూపాయి రీకవరీ కారణంగా పసిడి ధర స్వల్పంగా నష్టపోయింది. ఫలితంగా బుధవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి రూ.66లు నష్టపోయి రూ.30651.00ల వద్ద ముగిసింది.You may be interested

ఇర్కాన్‌ ఐపీవో: సబ్‌స్క్రైబ్‌ చేయాలా? వద్దా?

Thursday 13th September 2018

రైల్వే శాఖ నేతృత్వంలోని ‘ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌’ ఐపీవోకు వస్తోంది. మరి ఇందులో ఇన్వెస్ట్‌ చేయాలా? వద్దా? అనే సందేహం చాలా మంది ఇన్వెస్టర్లకు ఉంటుంది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఇర్కాన్‌ ఐపీవోను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని సిఫార్సు చేసింది. 4 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది.    ఐపీవో వివరాలు.. ప్రైస్‌బాండ్‌: రూ.470-475 ఫేస్‌ వ్యాల్యు: రూ.10 ఇష్యూ సైజ్‌: రూ.470 కోట్లు మినిమమ్‌ లాట్‌ సైజ్‌: 30 ఇష్యూ ప్రారంభం: సెప్టెంబర్‌ 17 ఇష్యూ ముగింపు: సెప్టెంబర్‌ 19 షేర్‌ హోల్డింగ్స్‌  

ఫైజర్‌ హోల్డ్‌ చేయొచ్చు

Thursday 13th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా ఫైజర్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: సెం‍ట్రమ్‌ స్టాక్‌: ఫైజర్‌ ఇండస్ట్రీ: ఫార్మా రేటింగ్‌: హోల్డ్‌  ప్రస్తుత ధర: రూ.3,576 టార్గెట్‌ ప్రైస్‌: రూ.3,100 డౌన్‌సైడ్‌: 13.8 శాతం  సెంట్రమ్‌.. ఫైజర్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. స్టాక్‌ రేటింగ్‌ను బై నుంచి హోల్డ్‌కి తగ్గించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.3,100గా నిర్ణయించింది. ఫైజర్‌ స్టాక్‌ గత కొద్ది కాలంగా బాగా పెరిగిందని, అందువల్ల అధిక వ్యాల్యుయేషన్స్‌ చోటుచేసుకున్నాయని

Most from this category