STOCKS

News


1300డాలర్లకు దిగువకు పసిడి

Friday 12th April 2019
Markets_main1555044729.png-25081

అంతర్జాతీయంగా పసిడి ధర మళ్లీ 1300డాలర్ల దిగువకు చేరుకుంది. డాలర్‌ ఇండెక్స్ అనూహ్య రికవరీ పసిడి పతననాకి కారణమైంది. నేడు ఆసియాలో 1.30డాలరు స్వల్పంగా పెరిగి 1,294.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్న విడుదల చేసిన ప్రోడ్యూసర్‌ ప్రైస్‌ గణాంకాలు 5నెలల గరిష్టానికి చేరుకోవడంతో పాటు యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టడంతో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువ డాలర్‌ ఇండెక్స్‌ 97స్థాయికి చేరుకుంది. ‘‘అమెరికా ప్రోడ్యూసర్‌ ప్రైస్‌ గణాంకాలు మార్కెట్‌ అంచనాలకు మించి నమోదయ్యాయి. ఇవి ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినట్లు సంకేతానిస్తున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు మెతక వైఖరిని మార్చుకునేందుకు దోహదపడవచ్చు. అలాగే డాలరు ఇండెక్స్‌ అనూహ్య రికవరీ సైతం పసిడి ఫ్యూచర్లలో అమ్మకాలకు కారణమయ్యాయి. అని ఆర్‌జేఓ ఫ్యూచర్‌ సీనియర్‌ కమోడిటీ అధికారి ఫిలిఫ్‌ తెలిపారు. 
దేశయంగా భారీ పతనం:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పసిడి ధర భారీగా పతనమైంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 68 దిగుకు చేరుకోవడం, ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల కీలక స్థాయిని కోల్పోడంతో నిన్న రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.531లు నష్టపోయి రూ.31750ల వద్ద ముగిసింది. నేటి ఉదయం స్వల్పంగా కోలుకుని రూ.120.00 లాభంతో 31870.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

డిజిటల్‌ గోల్డ్‌కు ఆదరణ

Friday 12th April 2019

డిజిటల్‌ గోల్డ్‌కు ఆదరణ విస్తరిస్తున్న మార్కెట్‌ ఏటా తొమ్మిది టన్నుల విక్రయాలు మూడు టన్నుల మేర డెలివరీ బరిలో పేటీఎం, గూగుల్‌పే, మోతీలాల్‌ ఈ మార్కెట్లో అవకాశాలపై కన్ను న్యూఢిల్లీ: బంగారం డిజిటల్‌ రూపంలోనూ తళుక్కుమంటోంది. ఆన్‌లైన్‌లో డిజిటల్‌ గోల్డ్‌ కొనేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరుగుదలే దీన్ని తెలియజేస్తోంది. 2012-13లో బంగారం డిజిటల్‌ ఖాతాల ఆరంభం నుంచి చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్లకు పైగా ఖాతాలు ఆరంభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 12th April 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సిప్లా:- దేశంలో మొదటి ఐసీఎస్‌-ఎల్ఎబీఏ కాంబినేషన్‌ ఔషధాన్ని విడుదల చేసింది. ఈ జనరిక్‌ ఔషధాన్ని శ్వాసకోశ సంబంధిత వ్యాధుల చికిత్సలో వినియోగిస్తారు.  లుమాక్స్‌ అటో:- జర్మన్‌కి చెందిన జేఫ్‌ హోల్డింగ్‌ కంపెనీతో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్‌ వెంచర్‌ ఇరు దేశాల్లో అటోమోటివ్‌ ఉపకరణాలను విక్రయించనుంది.  ఐడీబీఐ బ్యాంక్‌:- వివిధ వడ్డీరేట్లపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 5 నుంచి 10

Most from this category