STOCKS

News


8నెలల గరిష్టానికి పసిడి

Wednesday 30th January 2019
news_main1548832963.png-23899

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ యథాతధ పాలసీ అంచనాలు, ట్రేడ్‌ చర్చలు నేపథ్యంలో పసిడి ధర  8నెలల గరిష్టానికి పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో మంగళవారం ఔన్స్‌ పసిడి 5.50డాలర్లు పెరిగి 1314 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతేడాది మే14 తరువాత పసిడికి ఈ స్థాయిని వద్దకి చేరుకోవడం ఇదే ప్రథమం. అమెరికా న్యాయ విభాగం నిన్న చైనా దేశపు హువాయ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సీఎఫ్‌ఓతో పాటు మరో ఇద్దరు అధికారులపై చార్జ్‌షీట్‌ ధాఖలు చేసిన నేపథ్యంలో వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్లలో సందేహాలు రేకత్తాయి. మరోవైపు కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ యథాతధ పాలసీకే కట్టుబడి ఉన్నట్లు ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సంకేతాలివ్వడం పసిడికి మరింత బలానిస్తున్నాయి.
దేశీయంగా స్వల్ప పెరుగుదల:-
దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. బుధవారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.65.00లు పెరిగి రూ.32965.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం ట్రేడింగ్‌లో ప‌సిడి ధర రూ.350లు లాభపడింది. డాల‌ర్ మార‌కంలో రూపాయి ఫ్లాట్ ట్రేడింగ్‌, దేశీయ ఈక్విటీ మార్కెట్ల‌లో అస్థిర‌త ప‌సిడి ధ‌ర‌కు కలిసొచ్చింది. గత రాత్రి అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప‌సిడి ధ‌ర 8నెల‌ల గ‌రిష్టానికి చేరుకోవ‌డం కూడా ప‌సిడి ర్యాలీకి తోడ్పాటును అందించాయి.  ఫ‌లితంగా ఎంసీక్స్ మార్కెట్‌లో 10గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.353లు లాభ‌ప‌డి రూ.32900.00 వ‌ద్ద ముగిసింది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం జంప్‌

Wednesday 30th January 2019

బుధవారం మధ్యాహ్నం మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్ల పెరుగుదలతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌  1శాతం ర్యాలీ చేసింది. క్యూ3లో అదిరిపోయే ఫలితాలను నమోదు చేయడంతో నేటి ట్రేడింగ్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ 5శాతం ర్యాలీ చేసింది. నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించనున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ 4శాతం లాభపడింది. అలాగే ఎస్‌బీఐ షేరు సైతం 2శాతం పెరిగింది. ఈ మూడు షేర్ల ర్యాలీతో నిఫ్టీ

ప్రమోటర్ల ప్లెడ్జ్‌...మార్కెట్‌కు టెన్షన్‌

Wednesday 30th January 2019

దేశీయ కంపెనీల షేర్‌ తనఖాలు మార్కెట్‌లో ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. డిసెంబర్‌ త్రైమాసికం చివరకు దేశీయ ప్రమోటర్లు ప్లెడ్జ్‌(తనఖా) చేసిన షేర్ల విలువ రూ. 2.5 లక్షల కోట్లకు చేరింది. బీఎస్‌ఈ500 కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌లో ఈ ప్లెడ్జింగ్‌ షేర్ల విలువ దాదాపు 2 శాతం. 2017 చివరలో ప్లెడ్జ్‌ షేర్ల విలువ రూ. 2.4 లక్షల కోట్లు. ఇలా ఎక్కువమొత్తంలో షేర్లను తనఖా పెట్టిన కంపెనీ ప్రమోటర్లలో జీఎంటర్‌టైన్‌మెంట్,

Most from this category