STOCKS

News


పసిడి లాభాల బాట

Monday 3rd December 2018
Markets_main1543812596.png-22580

అమెరికా - చైనా దేశాల మధ్య కుదిరిన వాణిజ్యయుద్ధ సంధితో సోమవారం పసిడి ధర లాభాల బాట పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:0లకు ఔన్స్‌ పసిడి ధర 4.60డాలర్లు పెరిగి రూ.1230.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. జీ-20 సదస్సులో గత కొంతకాలంగా  అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంపై దేశాధినేతలు చర్చలు జరిపారు. దాగాపు గంటన్నరపాటు జరిగిన ఈ చర్చల్లో ఇరుదేశాలు తాత్కాలికంగా వాణిజ్యయుద్ధానికి ముగింపు పలికాలని సంధి కుదర్చుకున్నారు. అగ్రరాజ్యాల మధ్య సంధి కుదరడంతో సోమవారం ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఆరు ప్రధాన కరెన్సీ మారకంలో డాలర్‌ ఇండెక్స్‌ విలువ తగ్గుముఖం పట్టి 97 స్థాయిని కోల్పోయింది. డాలర్‌ ఇండెక్స్‌ పతన అంశం పసిడికి కలిసొస్తుంది. ఫలితంగా ఆసియా నేడు ఆసియా ట్రేడింగ్‌లో 5డాలర్లు లాభపడి  1,231.30డాలర్ల వరకు ర్యాలీ చేసింది. గతశుక్రవారం రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 1,226.00 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
దేశీయంగా రూ.200లు లాభం:-
నేడు డిసెంబర్‌ కాంట్రాక్టు పసిడి ధర రూ.30, 392ల వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ర్యాలీ చేయడంతో పాటు, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత దేశీయంగా పసిడి కలిసొస్తున్నాయి. ఫలితంగా ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర నేటి ఇంట్రాడేలో రూ.210లు లాభపడి రూ.30,450.00ల వద్దకు ర్యాలీ చేసింది. ఉదయం గం.10:10లని.లకు పసిడి ధర రూ.195.00ల లాభంతో రూ.30435.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

వాణిజ్యయుద్ధానికి తాత్కలిక బ్రేకులు

Monday 3rd December 2018

- అమెరికా, చైనా సంధి!! - వివాదాల పరిష్కారానికి నిర్ణయం - ప్రస్తుతానికి కొత్త టారిఫ్‌లు విధించబోమని ట్రంప్‌ హామీ - వాణిజ్య లోటు భర్తీకి జింగ్‌ భరోసా బ్యూనస్‌ ఎయిర్స్‌:- దాదాపు ఆరు నెలలుగా వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన అమెరికా, చైనాల మధ్య  ఎట్టకేలకు సంధి కుదిరింది. వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రస్తుతానికి కొత్తగా మరిన్ని టారిఫ్‌లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు

రూపాయి డౌన్‌

Monday 3rd December 2018

డాలరుతో 70.08 వద్ద ప్రారంభం ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో 50 పైసలు బలహీనపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 70.08 దగ్గర ప్రారంభమయ్యింది. దిగుమతిదారులు, బ్యాంకర్ల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరిగి డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. గతకొంత కాలంగా నష్టపోతూ వచ్చిన ముడిచమురు ధరలు ఇవాళ స్వల్పంగా బలపడడం, శుక్రవారం

Most from this category