STOCKS

News


ఈక్విటీల పతనంతో పసిడి జోరు

Monday 29th October 2018
Markets_main1540790751.png-21555

  • ఈక్విటీల పతనంతో పసిడి జోరు!
  • వరుసగా నాలుగు వారాలుగా లాభాల బాట

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ నైమెక్స్‌లో పసిడి పరుగు వరుసగా నాల్గవ వారంలోనూ కొనసాగింది. శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్‌ ధర (31.1గ్రా) ఆరు డాలర్లు లాభపడి 1,232 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,240 డాలర్లను కూడా చూసింది. మూడు నెలల గరిష్ట స్థాయి ఇది. అమెరికా ఈక్విటీ మార్కెట్ల పతనం, బాండ్‌ ఈల్డ్స్‌ నష్టాలు దీనికి నేపథ్యం. మొత్తంమీద ఆరు నెలలుగా పడుతూ వచ్చిన పసిడి, 1,160 డాలర్ల వరకూ పతనమైనా, వెంటనే రికవరీతో 1,185-1,210 శ్రేణిలో పటిష్ట కన్సాలిడేటెడ్‌ ధోరణి ప్రదర్శించింది. 1,200 డాలర్లు పసిడి ‘స్వీట్‌ స్టాప్‌’గా విశ్లేషకులు పేర్కొన్నారు. ఆ లోపునకు ధర పడిపోతే ఉత్పత్తిదారులకు నష్టం వచ్చే పరిస్థితుల్లో అవి మూతపడతాయని, తిరిగి పసిడికి డిమాండ్‌ పెరిగి వెంటనే 1,200 డాలర్లపైకి పసిడి ఎగయడం ఖాయమని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా-సౌదీ అరేబియాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలూ, కంపెనీల ఫలితాలు ప్రత్యేకించి టెక్నాలజీ సంస్థల గణాంకాలు అంచనాలకు తగినట్లుగా లేకపోవడంమ పసిడి లాభాలకు తోడయ్యాయి. ఈ నెలలో 4 శాతం పసిడి లాభపడింది.  ‘‘ఈక్విటీలు ఇదే విధంగా కిందకు జారితే, పసిడి మున్ముందు మరింతపైకి లేవడం ఖాయం. ఇన్వెస్టర్లు ప్రస్తుతం తమ ఇన్వెస్ట్‌మెంట్లకు పసిడినే ఎంచుకోవడం జరుగుతుంది’’ అని సిటీ ఇండెక్స్‌లో టెక్నికల్‌ అనలిస్ట్‌ రజాక్‌జాదా పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో పసిడి బులిష్‌గానే ఉంటుందని డైలీఫారెక్స్‌.కామ్‌లో సీనియర్‌ కరెన్సీ వ్యూహకర్త క్రిస్టోఫర్‌ అభిప్రాయపడ్డారు.

కొంచెం జాగ్రత్త అవసరం...
అయితే ప్రస్తుత స్థాయి వద్ద కొంత జాగరూకత అవసరమని ఇన్వెస్టర్లకు బ్లూలైన్‌ ఫ్యూచర్స్‌ ప్రెసిడెంట్‌ బిల్‌ బ్రూచ్‌ సూచించారు. ప్రస్తుత స్థాయి కీలక నిరోధంగా ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వృద్ధి పటిష్టత, డిసెంబర్‌లో ఈఏడాదిలో నాల్గవసారి ఫెడ్‌రేటు పెంపు అవకాశాలు, డాలర్‌ ఇండెక్స్‌ పటిష్ట స్థాయిలో ఉండడం (శుక్రవారం 96.13 వద్ద ముగింపు) వంటి అంశాలను ప్రస్తావించారు.

దేశంలో సానుకూలత
కాగా పసిడి ధరకు దేశంలో మద్దతు లభిస్తోంది. అంతర్జాతీయంగా ధర పెరగడం సంగతి ఒకవైపయితే,  డాలర్‌ మారకంలో రూపాయి విలువ మారకం బలహీనత మరోవైపు దీనికి దోహదపడుతున్న అంశాలు. శుక్రవారం ప్రధాన స్పాట్‌ మార్కెట్‌ ముంబైలో పసిడి 10 గ్రాములకు 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ.32,810, రూ.31,250 వద్ద ముగిశాయి. కాగా  ఫ్యూచర్స్‌- ఎంసీఎక్స్‌లో ధర 10 31,932 వద్ద ముగిసింది.You may be interested

రూపాయి పతనానికి విరుగుడు ఏమిటి

Monday 29th October 2018

- మన మార్కెట్లలో భారీగా నష్టాలు - అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలు - ఈ ఏడాది ఇప్పటికి 21 శాతం రాబడి - అమెరికా కంపెనీల మెరుగైన పనితీరు - డాలర్‌ బలోపేతం ఈ రెండు రకాలుగా లాభమే - పోర్ట్‌ఫోలియో రిస్క్‌ తగ్గించుకునేందుకు విదేశీ ఫండ్స్‌ - ఎగుమతి ఆధారిత కంపెనీలు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లూ చూడొచ్చు (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) రూపాయి పతనం ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేస్తోంది. ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

బైక్‌ కోసం... ఏ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి..?

Monday 29th October 2018

ప్ర: నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మ్యూచువల్‌ ఫండ్స్‌లో 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మల్టీక్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌నా లేక మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? 25 ఏళ్ల కాలంలో మల్టీ క్యాఫ్‌ ఫండ్‌ కంటే స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ అధిక రాబడులనిస్తుందా ? ఏ ఫండ్‌ను ఎంచుకోమంటారు ? -ఉమాదేవి, విశాఖ పట్టణం జ: భారత్‌లాంటి దేశాల్లో 25 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్మాల్‌ క్యాప్‌

Most from this category