News


మళ్లీ 1300డాలర్ల పైకి పసిడి ధర

Wednesday 13th March 2019
Markets_main1552465006.png-24584

బ్రెగ్జిట్‌ ఆందోళనల నేపథ్యంలో పసిడి ధర తిరిగి 1300డాలర్లపైకి చేరుకుంది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 7.50డాలర్లు లాభపడింది. యూరోపియన్ నుంచి బ్రిటన్ వైదొలగటానికి సంబంధించి ప్రధానమంత్రి థెరెసా మే రూపొందించిన ముసాయిదా ఒప్పందాన్ని పార్లమెంటు తిరస్కరించింది. మొత్తం 391 సభ్యులున్న హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో థెరెసా ప్రతిపానను 242 మంది సభ్యులు తిరస్కరించారు.  ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటానికి తుది గడువు అయిన మార్చి 29వ తేదీకి ఇక కేవలం 17 రోజులే మిగిలివున్న నేపథ్యంలో పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణి అవలంభిస్తూ పసిడి ఫ్యూచర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. అలాగే ఫిబ్రవరి అమెరికా ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు సానుకూల ధోరణిగా ఉండటం సైతం పసిడి ర్యాలీకి తోడ్పాటును నిస్తున్నాయి. పలితంగా ఆసియా ట్రేడింగ్‌లో 7.50డాలర్లు లాభపడి 1,305.75 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యహ్నం గం.12:30లకు పసిడి ధర గత ముగింపు ధర(1298.10డాలర్లు)తో పోలిస్తే 6.50డాలర్లు లాభంతో 1,304.55డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
దేశీయంగా రూ.100లు అప్‌:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి భారీగా లాభపడినప్పటికీ, దేశీయంగా మాత్రం స్వల్పంగా లాభపడింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.107లు లాభపడి రూ.32107.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

వచ్చే ఐదేళ్ల పాటు ఎర్నింగ్స్‌ వృద్దిలో జోరు

Wednesday 13th March 2019

దేశీయ ఎకానమీ సరికొత్త ఫండమెంటల్‌ సైకిల్‌ ఆరంభంలో ఉందని మోర్గాన్‌స్టాన్లీ వ్యూహకర్త రిధమ్‌ దేశాయ్‌ చెప్పారు. ఈ సైకిల్స్‌ కాలపరిమితి దీర్ఘకాలం ఉంటుందని, తాజా సైకిల్‌ కనీసం 5- 7 సంవత్సరాలు కొనసాగవచ్చని తెలిపారు. ఇలాంటి చక్రీయ వలయాల కాలంలో ఎర్నింగ్స్‌ వృద్ధి బలంగా నమోదవుతుందన్నారు. ఇందుకు తగిన రంగం సిద్ధం చేసే క్రమంలో రెండేళ్లుగా రెవెన్యూ వృద్ధి ఊపందుకుంటోందని వివరించారు. ఇంకా లాభాల్లో జోరు పెరగాల్సిఉందన్నారు. ఇవన్నీ గమనిస్తే

'వీడియోకాన్' యూనిటీ అప్లయెన్సెస్ ఆస్తుల విక్రయం

Wednesday 13th March 2019

న్యూఢిల్లీ: దాదాపు రూ. 154 కోట్ల రుణాలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన యూనిటీ అప్లయెన్సెస్‌ స్థిర, చరాస్తులను ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) వేలానికి ఉంచింది. 2018 జనవరి 5 నుంచి యూనిటీ అప్లయెన్సెస్ సంస్థ రూ. 153.77 కోట్లతో పాటు వడ్డీ చెల్లించాల్సి ఉందని బ్యాంకు తెలిపింది. ఈ సంస్థ తమిళనాడులోని సిప్‌కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఎయిర్ కండీషనర్లు, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలను

Most from this category