STOCKS

News


పసిడికి డాలర్‌ ఎఫెక్ట్‌

Monday 13th August 2018
Markets_main1534135224.png-19197

ముంబై:- డాలర్‌ పెరుగుదలతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర సోమవారం భారత కాలమానం ప్రకారం గం.10:00 ని.లకు 3.70 డాలర్లు స్వల్ప తగ్గుదలతో 1,215.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. టర్కీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా డాలర్‌ విలువ 13నెలల గరిష్టానికి తాకింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల మారకంలో డాలర్‌ ఇండెక్స్‌ జూలై 2017 తరువాత 96.50 స్థాయికి చేరుకుంది. మరోవైపు ట్రెజరీ ఈల్డ్‌ బలహీనం పడటం కూడా పసిడి పతనానికి కారణమైంది. గతవారం మార్కెట్‌ చివరి రోజైన శుక్రవారం నాడు అమెరికా మార్కెట్ల పతనంతో అక్కడి పసిడి 1220 డాలర్ల దిగువున 1,219.00 డాలర్ల వద్ద ముగిశాయి.
దేశీయంగా పెరుగుదల:-
అంతర్జాతీయంగా డాలర్‌ 13నెలల గరిష్టానికి చేరుకోవడంతో దేశీయంగా రూపాయి మారక విలువ తన జీవితకాల కనిష్టానికి చేరుకుంది. రూపాయి పతనంతో దేశీయ మార్కెట్లో  పసిడి పరుగులు పెడుతోంది. ఎంసీఎక్స్‌లో సోమవారం 10 గ్రాముల పసిడి ధర రూ.65.00లు పెరిగి రూ. 29848 వద్ద ట్రేడ్‌ అవుతోంది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.29783ల వద్ద ముగిసింది. ఆ రోజు రాత్రే ఆఫ్‌షోర్‌ మార్కెట్లో రూపాయి 69.10 వద్దకు క్షీణించడంతో ఇక్కడ బంగారం ధర కూడా పెరిగింది. తాజాగా రూపాయి మరింత పతనంకావడం, అంతర్జాతీయ మార్కెట్లో సైతం పసిడి తగ్గడంతో సోమవారం ఎంసీఎక్స్‌లో ధర ఇంకాస్త పెరిగింది.



You may be interested

ఐబీసీతో రుణాల రికవరీ వేగవంతం: ఫిక్కీ

Monday 13th August 2018

న్యూఢిల్లీ: ఐబీసీతో రుణాల రికవరీ ప్రక్రియ వేగవంతం అయిందని, బ్యాంకుల పరిస్థితి మెరుగుపడిందని ఫిక్కీ అభిప్రాయపడింది. ఐబీసీతో రుణాల ఎగవేతకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం ముందుకు వచ్చే ధోరణి కంపెనీల ప్రమోటర్లలో పెరిగినట్టు ఫిక్కీ సర్వేలో బ్యాంకర్లు పేర్కొన్నారు. రుణాల రికవరీ మరింత వేగవంతం అయ్యేందుకు న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని పెంచాలని బ్యాంకర్లు సూచించారు. మారిటోరియంను 270 రోజులకు మించి అనుమతించకూడదని ఫిక్కీ సర్వేలో పాల్గొన్న 22 బ్యాంకర్లు కోరారు.

11,350 దిగువకు నిఫ్టీ

Monday 13th August 2018

మార్కెట్‌ నష్టాలు మరింత పెరిగాయి. నిఫ్టీ 11,350 దిగువకు వచ్చేసింది. 80 పాయిట్ల క్షీణతతో 11,349 వద్ద ట్రేడవుతోంది. ఇక సెన్సెక్స్‌ ఏకంగా 267 పాయింట్ల క్షీణతతో 37,602 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  అమెరికా మార్కెట్లు శుక్రవారం క్షీణించడం, ఆసియా మార్కెట్లు కూడా సోమవారం నష్టాలోనే ట్రేడవుతుండటం, టర్కీ లిరా క్షీణించడంతో యూరో ఏడాది కనిష్ట స్థాయికి పడిపోవడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం, గ్లోబల్‌

Most from this category