STOCKS

News


అక్కడక్కడే పసిడి ధర

Tuesday 6th November 2018
Markets_main1541483680.png-21751

అమెరికాలో మధ్యంతర ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం పసిడి ధర అక్కడక్కడే ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.20లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,230.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) రెండు రోజుల పరపతి సమీక్షా సమావేశాలు 7న(బుధవారం) ప్రారంభంకానున్నాయి. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఫెడ్‌ రిజర్వ్‌ అనుసరిస్తున్న వడ్డీ రేట్ల పెంపు విధానాలపట్ల బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితంగా పసిడి ధరలపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ కూడా 0.04 శాతం స్వల్ప లాభంతో 96.18 స్థాయి వద్ద స్థిరంగా నేడు అవుతోంది. మరోవైపు ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూచిధోరణి అవలంభిస్తున్నారు. రాత్రి అమెరికా మార్కెట్ల మిశ్రమ ముగింపు కారణంగా పసిడి 1,232.30 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగా స్వల్ప తగ్గుదల:-
నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.18ల స్వల్పలాభంతో రూ.31720ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతోంది. రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 67 పైసలు క్షీణించిన నేపథ్యంలో ఫారెక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.46లు నష్టపోయి రూ.31702ల వద్ద ముగిసింది.



You may be interested

సంవత్ 2075లో నిఫ్టీ టార్గెట్‌ 11,800..!

Tuesday 6th November 2018

నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ హెడ్‌ వినీతా శర్మ విశ్లేషణ ముంబై: ద్రవ్యలభ్యత, వాల్యుయేషన్స్‌, సెంటిమెంట్ వంటి పలు కీలక అంశాల నేపథ్యంలో గతేడాది సూచీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు కారణంగా దేశీ మార్కెట్లలో అటు డెట్‌లోనూ ఇటు ఈక్విటీలోనూ విదేశీ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో అమ్మకాలకు పాల్పడ్డారు. అంతకుముందు ఏడాదిలో 50 డాలర్ల వద్ద ఉన్నటువంటి బ్యారెల్‌ క్రూడ్‌ ధర సంవత్ 2074లో 70 డాలర్లను అధిగమించి కమోడిటీ

హైదరాబాద్‌ కుర్రాడి ‘ఆసీ టికెట్‌’

Tuesday 6th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత పాశం భరత్‌రెడ్డికి చక్కగా సరిపోతుంది. సొంత గడ్డపై రెండు కంపెనీలు ఏర్పాటు చేసి... విజయవంతంగా నడిపిస్తున్న భరత్‌రెడ్డి... టీ-హబ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆస్ట్రేలియాలోనూ అడుగుపెట్టాడు. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ క్వీన్స్‌ల్యాండ్‌లో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌లో చేరి... అక్కడా వ్యాపారావకాశాలు వెదికాడు. ఆస్ట్రేలియాలో వ్యవస్థీకృతంగా స్పోర్ట్‌, ఈవెంట్స్‌కు ముందుగా టికెట్లు బుక్‌ చేసుకునే పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ సౌకర్యం

Most from this category