STOCKS

News


స్థిరంగానే పసిడి ధర

Tuesday 20th November 2018
Markets_main1542691531.png-22218

అమెరికా బలహీన ఆర్థిక గణాంకాల విడుదల, ప్రపంచ ఆర్థిక మందగమనంపై ఫెడ్‌ అధికారుల ఆందోళన తదితర అంశాలు డాలర్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. పసిడి ధరకు ఈ అంశం సానుకూలంగా మారింది. ఫలితంగా మంగళవారం ప్రపంచమార్కెట్లో పసిడి స్థిరమైన ర్యాలీ చేస్తుంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.00డాలర్లు స్వల్పంగా నష్టపోయి 1,224.30 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా హౌసింగ్‌ మార్కెట్‌ గణాంకాలు రెండున్నరేళ్ల కనిష్టస్థాయిలో నమోదయ్యాయి. మరోవైపు ప్రపంచ ఆర్థిక మందగమనంతో డిసెంబర్‌లో ఫెడ్‌ వడ్డీరేట్లపై నెలకొన్న సందిగ్ధత డాలర్‌పై ఒత్తిడిపై పెంచుతున్నాయి. పసిడిపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో నష్టాలతో 96.16 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు గతరాత్రి టెక్నాలజీ షేర్ల పతనంతో అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపును అందిపుచ్చుకున్న ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ కూడా పసిడి ధరకు కలిసొస్తుంది. రాత్రి అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపు నేపథ్యంలో అక్కడ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1,225.30 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా రూ.31వేల దిగువకు:-
ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడంటంతో దేశీయ ఎంసీక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.31వేల దిగువన ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీక్స్‌లో డిసెంబర్‌ కాంట్రాక్టు ధర రూ.30,787.00ల వద్ద ప్రారంభమైంది. డాలర్ మారకంలో రూపాయి బలపడటంతో పసిడి నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.10:30లకు ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర క్రితం ముగింపు ధర(రూ. 30879)తో పోలిస్తే రూ.69లు నష్టపోయి రూ.30810ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

నష్టాల్లో పీసీఏ బ్యాంకులు

Tuesday 20th November 2018

ముంబై:- పీసీఏ నిబంధనల పరిధిలో ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు మంగళవారం 7శాతం నష్టపోయాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు సోమవారం ఆర్‌బీఐ బోర్డు సోమవారం సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో పీసీఏ పరిధిలోని 11 ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలన్న నిర్ణయానికి ఆర్‌బీఐ బోర్డు వచ్చింది. అయితే అనూహ్యంగా పీసీఏ పరిధిలోకి 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల బాట పట్టాయి.

ఆర్‌బీఐ-కేంద్రం సయోధ్య.. రూపీకి బలం..

Tuesday 20th November 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం లాభాల్లో ట్రేడవుతోంది. రూపాయి బలపడటం ఇది వరుసగా ఆరో సెషన్‌. అలాగే రూపాయి వరుసగా ఇన్ని సెషన్లు పెరగడం 2017 అక్టోబర్‌ నుంచి చూస్తే ఇదే ‍ప్రధమం. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య సోమవారం జరిగిన సమావేశంలో దాదాపు కీలక అంశాలన్నిటి మధ్య సయోధ్య కుదరడం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో

Most from this category