STOCKS

News


స్థిరంగా పసిడి ధర

Tuesday 30th October 2018
Markets_main1540876036.png-21573

డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలర్లు లాభంతో 1,228.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో పాటు ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టిందనే కారణాలతో డాలర్‌ ఇండెక్స్‌ క్రమంగా పుంజుకుంటోంది. నేడు డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువలతో పోలిస్తే 0.34 పాయింట్లు పెరిగి 96.47 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక గతరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి వారం కనిష్ట ధర 1,227.60డాలర్ల వద్ద ముగిసింది. అక్కడ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో పాటు డాలర్‌ బలపడటం ఇందుకు కారణమైంది.
దేశీయంగానూ స్థిరంగానే:-
అంతర్జాతీయం ట్రెండ్‌కు అనుగుణంగానే పసిడి ధర దేశీయంగా స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.28.00లు లాభపడి రూ.31916.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి వారం రోజుల కనిష్టానికి చేరిన నేపథ్యంలో ఇక్కడి ఎంసీక్స్‌ మార్కెట్లో రూ.49లు నష్టపోయి రూ.31888ల వద్ద ముగిసింది.



You may be interested

సగం తగ్గిన బీపీసీఎల్‌ లాభం

Tuesday 30th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నికర లాభం సెప్టెంబర్‌ క్వార్టర్లో 48 శాతం తగ్గిపోయి రూ.1,218 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.2,357 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.64,133 కోట్ల నుంచి రూ.82,884 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా వ్యయాలు పెరిగిపోవడం ప్రభావం చూపించింది. వ్యయాలు రూ.61,475 కోట్ల నుంచి రూ.81,550 కోట్లకు 

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 30th October 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే కొన్ని షేర్ల వివరాలు టాటా పవర్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో కంపెనీ రూ.5,500 కోట్ల ఎన్‌సీడీల జారీకి ఆమోదం తెలిపింది. కెడిల్లా హెల్త్‌కేర్:- ఈక్విటీ షేర్ల రూపంలో విండ్లస్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 51శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియతో విండ్లస్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ... కెడిల్లా హెల్త్‌కేర్‌ అనుబంధ సంస్థగా మారనుంది. సన్‌టెక్‌ రియల్టీ:- రూ.25 కోట్ల వాణిజ్య పేపర్ల ఇష్యూను

Most from this category