STOCKS

News


స్థిరంగా పసిడి

Monday 13th May 2019
Markets_main1557726786.png-25696

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా కదలుతుంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి 1డాలరు స్వల్పంగా లాభపడి 1,288.40డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య చర్చలు సందిగ్ధత నెలకొనడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా సంక్షోభ సమాయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ నెలకొంది. అమెరికా ప్రతిపాదించిన విధివిధానాలకు అనుగుణంగా చైనా తన వాణిజ్య చట్టాలను మార్పు చేయాల్సిందిగా ఆదివారం అమెరికా అధికార ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై చైనా స్పందిస్తూ తమకు నష్టాన్ని కలిగించే ఏ ఒక్క ప్రతిపాదనకు ఆమోదం తెలిపిలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 200మిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై అమెరికా విధించిన 15శాతం టారిఫ్‌ ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనా దిగుమతులన్నింటిపై సుంకాల విధింపు ప్రక్రియను ప్రారంభించాలని తన వాణిజ్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు. గతవారం అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పసిడి ధర 1,287.40 వద్ద ముగిసింది.
దేశీయంగానూ స్థిరంగానే:-
దేశీయంగా మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.60.00ల లాభంతో 31963.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 30పైసలు పతనమైనప్పటికి, పసిడి ర్యాలీ చేయకపోవడం గమనార్హం. గతవారంలో రూపాయి ఒడిదుడుకుల ర్యాలీ కారణంగా పసిడి 1.28శాతం లాభంతో రూ.31, 903ల వద్ద స్థిరపడింది. 



You may be interested

అప్రమత్తంగా మారిన ఎఫ్‌ఐఐలు

Monday 13th May 2019

వారం రోజులకు పైగా భారీ అమ్మకాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. వరుసగా 7 సెషన్లు సూచీలు నష్టపోయినందున కొంత రికవరీ కనిపించే ఛాన్సులున్నాయి. అయితే ఈ రికవరీ ఎంతవరకు ఉంటుందనేది చెప్పలేమని, ఎఫ్‌ఐఐలు క్రమంగా తమ పొజిషన్లు తగ్గించుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ట్రేడ్‌ టెన్షన్లు పెరగడం విదేశీ మదుపరులను అప్రమత్తం చేస్తోంది. దీంతో ఈక్విటీల్లో పొజిషన్లను ఎఫ్‌ఐఐలు తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికైతే వీరు దేశీయ ఈక్విటీల్లో నికర కొనుగోలుదారులుగానే ఉన్నారు. కానీ

ఎస్‌బీఐ షేరుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయి?

Monday 13th May 2019

క్యు4 ఫలితాల అనంతరం అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు ఎస్‌బీఐ రేటింగ్‌ను యథాతధంగా కొనసాగిస్తూ టార్గెట్‌ ధరలను పెంచాయి. బ్యాంకు మార్చి త్రైమాసికంలో రూ. 838 కోట్ల లాభం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.. - నోమురా: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 375 నుంచి రూ. 400కు పెంచింది. బ్యాంకు క్రెడిట్‌ వ్యయాలు వచ్చే రెండేళ్లలో వంద బీపీఎస్‌

Most from this category