STOCKS

News


స్వల్పంగా తగ్గిన పసిడి

Saturday 8th September 2018
Markets_main1536382763.png-20091

న్యూయార్క్‌/ముంబై:- అంచనాలకు మించి నమోదైన అమెరికా ఉద్యోగ గణాంకాలు పసిడి ధరకి షాక్‌నిచ్చాయి. పసిడి ధర వారంతపు రోజైన శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌కు 2.50 డాలర్లు నష్టపోయి 1,201.80 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికాలో ఆగస్ట్‌లో అంచనాలకు మించి ఉద్యోగ కల్పన జరిగినట్లు శుక్రవారం విడుదలైన గణాంకాలు తెలియజేశాయి. ఈ ఆగస్ట్‌లో అత్యధికంగా 2.01లక్షల నూతన ఉద్యోగ నియామకాలు జరిగినట్లు అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. ఉద్యోగ అవకాశాలు పెరగడంతో ఫెడరల్ రిజర్వు రేట్ల పెంపు అంచనాలు బలపడ్డాయి. మరోవైపు డాలర్‌ బలపడటంతో డాలర్‌ ఇండెక్స్‌ 0.33 శాతం పెరిగి 95.34 వద్దకు చేరింది. ఫలితంగా పసిడి ధర ఈ వారంలో కూడా నష్టంతోనే ముగిసింది. ఈ వారం మొత్తంగా ఔన్స్‌కు 0.5 శాతం నష్టపోయింది.  ఇక వచ్చేవారంలో అమెరికా విడుదల చేయనున్న రిటైల్‌, సీపీఐ, పీపీఐ గణాంకాలతో పాటు గురువారం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, యూరోపిన్‌ సెంట్రల్‌ బ్యాంకు, ఇండియా వడ్డీరేట్ల ప్రకటన పసిడి ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపనున్నాయి.
దేశీయంగా స్వల్పంగా తగ్గుముఖం:-
అంతర్జాతీయ మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగా పసిడి ధర శుక్రవారం నష్టాలతో ముగిసింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి రూ.37లు స్వల్పంగా నష్టపోయి రూ.30510.00ల వద్ద ముగిసింది. ఇక వారం పరంగా చూస్తే గత రెండు వారాలు ర్యాలీ చేసిన పసిడి ధర ఈవారం మాత్రం నష్టాలతో ముగిసింది. ఈ వారం మొత్తంగా చూస్తే 10గ్రాముల పసిడి రూ.381ల వరకు పతనమైంది.



You may be interested

ఫినోలెక్స్‌ కేబుల్స్‌ కొనొచ్చు: జియోజిత్‌ ఫైనాన్స్‌

Saturday 8th September 2018

కేబుల్స్‌ తయారీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ‘‘ఫినోలెక్స్‌ కేబుల్స్‌’’ షేరు కొనొచ్చని జియోజిత్‌ ఫైనాన్స్‌ సిఫార్సు చేస్తోంది.  దేశీయ కేబుల్స్‌ మార్కెట్లో ఎక్కువ వాటా కలిగి ఉండి కేబుల్స్‌ పరిశ్రమను శాసిస్తోన్న ఫినోలెక్స్‌ సంస్థపై జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనాలు ఇప్పుడు చూద్దాం..! రేటింగ్‌:- కొనొచ్చు ప్రస్తుత ధర:- రూ.561 టార్గెట్‌ ధర:- రూ.649 ఆదాయపు అంచనా:- 17 శాతం విశ్లేషణ:- ఫినోలెక్స్‌ సంస్థ దేశంలో ప్రతి ఏటా విద్యుత్‌ కేబుల్స్‌ తయారీ మార్కెట్‌లో 80 శాతం, టెలికమ్యూనికేషన్స్‌

టెక్‌ బడి.. ‘బిజ్‌ ఏక్టివ్‌’

Saturday 8th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏఐ, బ్లాక్‌ చెయిన్‌ వంటి కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలంటే సిటీకి రావాలా? ట్రెయినింగ్‌ సెంటర్లో చేరాలా? ఇవన్నీ వద్దంటోంది స్టార్టప్‌ కంపెనీ ‘బిజ్‌ ఏక్టివ్‌’. ఒకటీ రెండూ కాదు ఏకంగా 87 రకాల టెక్నాలజీ కోర్సులు తమ సైట్‌ ద్వారానే నేర్చుకోవచ్చని చెబుతోంది ఈ సంస్థ. ‘వరంగల్‌’ కేంద్రంగా సేవలందిస్తున్న బిజ్‌ ఏక్టివ్‌లో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల నుంచి కూడా

Most from this category