STOCKS

News


స్వల్ప నష్టాల్లో పసిడి

Wednesday 10th April 2019
Markets_main1554878013.png-25042

డాలర్‌ బలపడటంతో పసిడి బుధవారం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు నష్టపోయి 1,305 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నేపథ్యంలో ఆసియాలో పలు మార్కెట్లు నష్టాల బాట పట్టడంతో పాటు యూరప్‌, అమెరికా మొదలైన వాణిజ్య యుద్ధ భయాలు పసిడికి అండగా నిలుస్తున్నాయి. ఫలితంగా ధర ఇప్పటికీ 2వారాల గరిష్టస్థాయిని నిలబెట్టుకోగలిగింది. ఆరు ప్రధాన కరెన్సీ డాలర్‌ ఇండెక్స్‌ 97.07 స్థాయిని చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూరోజోన్‌ నుంచి దిగుమతయ్యే​11 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులను సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించి మరో కొత్త ట్రేడ్‌ వార్‌కు తెరతీశారు. ఐఎంఎఫ్‌ తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను కోత పెట్టడంతో ప్రపంచఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు రక్షణాత్మక పసిడి వైపు మొగ్గు చూపడంతో పసిడి 1300డాలర్ల స్థాయిని అట్టిపెట్టుకుంది.
దేశీయంగానూ స్వల్ప తగ్గింపు:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటంతో పసిడి ప్రతికూలంగా మారింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాములు పసిడి ధర రూ.70.00లు నష్టపోయి రూ.32131.00లు వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఇన్ఫీ సీసీ రెవెన్యూలో 2 శాతం వృద్ధి!

Wednesday 10th April 2019

సీఎల్‌ఎస్‌ఏ అంచనా క్యు4లో ఇన్ఫోసిస్‌ స్థిరమైన ఫలితాల వృద్ది నమోదు చేస్తుందని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. రూపీ పతనం, యూఎస్‌ ఎకానమీలో రికవరీ కారణంగా టెక్నాలజీ రంగం ప్రయోజనం పొందుతుందని తెలిపింది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ రెవెన్యూ వృద్ది(స్థిర కరెన్సీ) 2 శాతం ఉంటుందని అంచనా వేసింది. అయితే మార్జిన్లలో 30 బేసిస్‌ పాయింట్ల తరుగుదల ఉండొచ్చని తెలిపింది. ఫారెక్స్‌ ఒడిదుడుకులు, పెట్టుబడుల కారణంగా మార్జిన్లపై భారం

28 నెలల కనిష్టస్థాయికి నిఫ్టీ ఫ్యూచర్‌ ఓపెన్‌ ఇంట్రస్ట్‌

Wednesday 10th April 2019

ఎన్నికల సందర్భంగా మార్కెట్లో సందిగ్ధత కొనసాగుతోది. దీంతో ట్రేడర్లు నిఫ్టీ ఫ్యూచర్స్‌లో పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ ఫలితంగా నిఫ్టీ ఫ్యూచర్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ మంగళవారం క్లోజింగ్‌ సమయానికి 1.6 కోట్లకు చేరింది. ఇది గత 28 నెలల కనిష్ఠస్థాయి. మార్కెట్‌ గమనంపై ట్రేడర్లకు స్పష్టమైన అంచనాలు లేకపోవడంతో చాలామంది పొజిషన్లు తగ్గించుకుంటున్నారు. గతనెల భారీ పరుగుల తర్వాత ప్రస్తుతం సూచీలు పరిమిత రేంజ్‌లో కదలాడుతున్నాయి. రాబోయే ఎన్నికల ఫలితాలపై అస్పష్టతే

Most from this category