STOCKS

News


1400 డాలర్ల దిగువకు పసిడి

Tuesday 9th July 2019
Markets_main1562650156.png-26913

డాలర్‌ బలపడటంతో పాటు ట్రేడర్ల అప్రమత్తతతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1400 డాలర్ల దిగువకు చేరుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల నష్టంతో 1,398.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమి పావెల్‌తో పాటు 10 మంది యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంకుర్లు  అమెరికా కాంగ్రెస్‌ ఎదుట చేసే ప్రసంగంపై ట్రేడర్లు దృష్టిని సారించారు. ముఖ్యంగా వడ్డీరేట్ల కోతపై వారు ఎలాంటి సంకేతాలు ఇస్తారోనని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ జూలైలో ఫెడ్‌ వడ్డీరేట్లపై కోత విధించవచ్చని అందరూ భావించారు. అయితే ఇటీవల విడుదలైన పలు ఆర్థిక గణాంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందనే సంకేతాలను సూచిస్తున్నా‍యి. ఈ నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీరేట్ల కోత విధింపుపై మార్కెట్‌ విశ్లేషకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పసిడి ధరకు వ్యతిరేక దిశలో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ 97.50 స్థాయికి ఎగసింది. ఈ ప్రతికూలాంశాలతో పసిడి ధర 1400 డాలర్ల స్థాయి దిగువకు పతనమైంది. ఫైనాన్స్‌ మార్కెట్లు కూలడానికి సిద్ధంగా ఉన్న ఇసుక మేడల్లా ఉన్నాయి. అమెరికా వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి వృద్ధి అంచనాలను బలహీనపరుస్తుంది. కాబట్టి ఈ ఏడాది చివరి కల్లా పసిడి 2000 డాలర్ల స్థాయి అందుకుంటుందని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకుడు డేవిడ్‌ రోచ్‌ అభిప్రాయపడ్డారు.
దేశీయంగానూ బలహీనంగానే:-
అంతర్జాతీ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర బలహీనంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీక్స్‌లో మార్కెట్లో పసిడి ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర గత వారం ముగింపు ధర(రూ.34583) రూ.31.00ల స్వల్ప లాభంతో రూ.34,610.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

దిగుమతులు తగ్గించడానికే పసిడిపై సుంకం పెంపు

Tuesday 9th July 2019

రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే న్యూఢిల్లీ: దేశంలోకి అవసరేతర దిగుమతులు తగ్గించాలన్న విధానంలో భాగంగానే 2019-20 బడ్జెట్‌లో పసిడిపై సుంకాన్ని 10  శాతం నుంచి 12.5 శాతానికి పెంచినట్లు రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే పేర్కొన్నారు. సుంకాల పెంపు వల్ల ఇప్పటికే తీవ్రంగా ఉన్న పసిడి అక్రమ దిగుమతులు, రవాణా మరింత తీవ్రమవుతాయని వ్యక్తమవుతున్న ఆందోళనలను రెవెన్యూ కార్యదర్శి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఇలాంటి చర్యల నిరోధానికి తగిన అన్ని

టైటాన్‌ 12 శాతం క్రాష్‌

Tuesday 9th July 2019

బంగారం ధరలు పెరగడంతో ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో డిమాండ్‌ తగ్గిందని టైటన్‌ ప్రకటించడంతో కంపెనీ షేరు విలువ మంగళవారం ట్రేడింగ్‌లో 12 శాతం నష్టపోయింది. స్థూల ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటు బంగారం ధరలు పెరగడంతో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వినియోగంపై ప్రభావం చూపాయని సంస్థ  సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాలలో పేర్కొంది.  దీంతో ఈ షేరు వరుసగా నాలుగోవ సెషన్‌లో కూడా నష్టపోయి ట్రేడవుతోంది. ‘ సంస్థ మార్కెట్‌ వాటా నిలకడగా

Most from this category