STOCKS

News


తగ్గిన పసిడి..!

Friday 13th July 2018
Markets_main1531466466.png-18277

ముంబై:- డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా శుక్రవారం పసిడి ధర తగ్గింది. అమెరికా గురువారం విడుదల చేసిన రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా ఉండటంతో పాటు, అమెరికా - చైనా వాణిజ్య యద్ధ భయాల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యంతో డాలర్‌ బలపడింది. డాలర్‌ ఇండెక్స్‌ గురువారం ఆసియా ట్రేడింగ్లో 94.93 స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ స్థిరమైన ర్యాలీతో ప్రస్తుతం ఆసియా ట్రేడింగ్‌లో  ఔన్స్‌ పసిడి ధర 2.20 డాలర్లు తగ్గి 1244.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ఇంట్రాడేలో పసిడి 2.40 డాలర్ల మేర పతనమై 1244.20 డాలర్ల వరకు పతనమైంది. గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల ముగింపు కారణంగా అక్కడ ఔన్స్‌ పసిడి 1246.60 వద్ద ముగిసింది.
దేశీయంగా స్థిరంగా:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టినా దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.1లు తగ్గి రూ.30146.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గురువారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి  10గ్రాముల పసిడి  160లు పతనమై రూ.30146.00ల వద్ద ముగిసింది.



You may be interested

ఇన్‌ఫ్రా స్టాకులకు ఏమైంది?

Friday 13th July 2018

దేశీయ ఇన్‌ఫ్రా రంగ కంపెనీల షేర్లు ఈ ఏడాది భారీగా పతనాలు నమోదు చేశాయి. ఇందుకు పలుకారణాలున్నాయని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు నోమురా, సిటీగ్రూప్‌ చెబుతున్నాయి. దిలీప్‌బుల్డ్‌కాన్‌, ఎన్‌సీసీ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌ సహా పలు ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు ఈ ఏడాది దాదాపు 20- 40 శాతం పతనమయ్యాయి. చాలా స్టాకులు ప్రస్తుతం వాటి రెండేళ్ల ఎర్నింగ్స్‌ మల్టిపుల్‌ కన్నా డిస్కౌంట్‌కు ట్రేడవుతున్నాయి. ఇంతలా ఈ షేర్లు కుంగిపోవడానికి కారణాలను

ఏడాదికోసం టాప్‌టెన్‌ సిఫార్సులు

Friday 13th July 2018

వచ్చే 12నెలల కాలానికి 30 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను జేఎం ఫైనాన్షియల్స్‌, షేర్‌ఖాన్‌ రికమండ్‌ చేస్తున్నాయి.. 1. అపోలోటైర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 305. దేశీయ ట్రక్‌, బస్‌ టైర్ల విభాగంలో బలంగా ఉంది. చైనా టైర్లపై విధించిన సుంకం కారణంగా కంపెనీ విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. దీనికితోడు హంగరీ ప్లాంట్‌ కార్యకలాపాలు పునర్‌వ్యవస్థీకరించడంతో యూరప్‌ వ్యాపారం మరింత జోరందుకోనుంది. ఈ ప్లాంట్‌తో ఎబిటా మార్జిన్లలో బ్రేక్‌ ఈవెన్‌వస్తుందని

Most from this category