STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 14th September 2018
Markets_main1536905415.png-20248

డాలర్‌ ఇండెక్స్‌ తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఆసియా మార్కెట్లో నేడుయ ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 11 గంటలకు ఔన్స్‌ పసిడి 2 డాలర్లు లాభపడి రూ.1,211 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా వెల్లడించే ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. దీంతో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ట్రంప్‌ ‘‘అమెరికాతో చైనాకు ఎదురైన వాణిజ్యపరమైన సమస్యలను పరిష్కారానికి ఇప్పటికీ తాము చైనా అధికారులను వాషింగ్టన్ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చల ద్వారా చైనాతో ఏర్పడే వాణిజ్య ఒప్పందాలతో అమెరికాకు ఎలాంటి ఒత్తిడి ఉండదు’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీ విలువలతో డాలర్‌ ఇండెక్స్‌ తగ్గుముఖం పట్టడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు కారణంగా అక్కడ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1,208.2డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ అదే ట్రెండ్‌:-
అంతర్జాతీయంగా మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధర లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో నేడు 10గ్రాముల పసిడి రూ.103.00లు లాభపడి రూ.30553.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రూపీ పతనాన్ని అడ్డుకునే అస్త్రాలు..

Friday 14th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ జీవిత కాల కనిష్ట స్థాయిలకు పతనమైంది. దాదాపు 73 దగ్గరకు క్షీణించింది. ఈ ఏడాది ఇప్పటిదాకా 13 శాతంపైనే పతనమైంది. అధిక డాలర్ల చెల్లింపుల వల్ల రూపాయి మారక విలువ తగ్గింది. స్థూల ఆర్థికాంశాలు బలంగా ఉన్నాయి. క్యూ1లో అంచనాలు మించిన జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండటం వంటివి ఇందుకు ఉదాహరణ. ఫారెక్స్‌ నిల్వలు కూడా ఆరోగ్యకరంగానే ఉన్నాయి.

శుక్రవారం వార్తల్లో షేర్లు..!

Friday 14th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  ఈ నెల 18 నుంచి షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించనుంది. వచ్చే నెల 3న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.1,100కు కొనుగోలు చేస్తారు. మొత్తం 3.64 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.4,000 కోట్లని సంస్థ తెలిపింది. అలహాబాద్‌ బ్యాంక్‌:- సుమారు రూ.1900

Most from this category