స్వల్పం పెరిగిన పసిడి
By Sakshi

ముంబై:- డాలర్ బలహీనతతో పసిడి ధర గురువారం స్వల్పంగా బలపడింది. బ్రెగ్జిట్ వార్తలు తెరపైకి రావడంతో బ్రిటీష్ పౌండ్, యూరో కరెన్సీల విలువ పెరుగుదల కారణంగా డాలర్ ఇండెక్స్ క్షీణించింది. ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలరు మారక విలువ నేడు 0.11శాతం నష్టపోయి 94.97శాతానికి పతనమైంది. ఫలితంగా డాలర్ ఇండెక్స్ విలువకు విలోమానుపాతంగా ట్రేడ్ అయ్యే పసిడి ధర పుంజుకుంటుంది. నేడు ఆసియా మార్కెట్లో భారతవర్తమాన కాలం గం.10:15ని.లకు ఔన్స్ పసిడి 1.60 డాలర్ల పెరిగి రూ.1202.90 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పసిడి ధర క్రితంరోజు ఉదయం ఆసియా మార్కెట్లో 1200 డాలర్ల దిగువున ట్రేడైన సంగతి తెలిసిందే. అయితే రాత్రి అమెరికా మార్కెట్లో 1200 డాలర్ల కీలక స్థాయిని అందుకుంది. అక్కడ మార్కెట్ ముగిసే సమయానికి ఔన్స్ పసిడి 1,201.3 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ అదే పెరుగుదలే:-
అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా పసిడి ధర దేశీయంగా పెరుగుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ ఫ్లాట్ ట్రేడ్ అవుతుండం ఇందుకు కారణమవుతోంది. ఎంసీఎక్స్‌లో గురువారం 10గ్రాముల పసిడి రూ.122.00లు లాభపడి రూ.30437.00ల వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం రాత్రి 10గ్రాముల పసిడి ధర రూ.140లు పెరిగి రూ.30315ల వద్ద ముగిసింది.
You may be interested
10 శాతం పతనానికి సిద్దంగా ఉండండి!
Thursday 6th September 2018ఇన్వెస్టర్లకు ఎడెల్వీజ్ సూచన దేశ ఎకానమీ వృద్ది రేటు ఆశించినట్లే పరుగులు తీస్తోంది కానీ కంపెనీల ఎర్నింగ్స్ మాత్రం ఇంకా అస్థిరంగానే ఉన్నాయని ప్రముఖ బ్రోకింగ్ దిగ్గజం ఎడెల్వీజ్ అబిప్రాయపడింది. మార్కెట్లో పెరిగిన వాల్యూషన్లకు తగినట్లు ఫలితాలు లేవని తెలిపింది. దీంతో ఎప్పుడైనా సూచీల్లో 10 శాతం కరెక్షన్ తప్పకపోవచ్చని అంచనా వేసింది. దేశీయ సూచీలపై ఎడెల్ వీజ్ నివేదికలో ముఖ్యాంశాలు.. - కంపెనీల ఫలితాలు మెరుగైతే ఇతర నెగిటివ్ అంశాలన్నీ మరుగునపడతాయి. - కానీ
ఎస్ఎంఈలపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టి
Thursday 6th September 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల వ్యయ నియంత్రణ, నిర్వహణ సేవలందిస్తున్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్ఎంఈ)లపై దృష్టిసారించింది. ఉద్యోగుల వేతనాలు, ప్రయోజనాల తర్వాత నియంత్రించగలిగేవి వినోద, ప్రయాణ వ్యయాలేనని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గ్లోబల్ కమర్షియల్ సర్వీసెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ శారు కౌశల్ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేట్ కార్డ్ ప్రోగ్రామ్ ద్వారా కంపెనీల వ్యయ భారం