News


మరింత తగ్గిన పసిడి

Monday 4th March 2019
Markets_main1551697288.png-24424

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో గత శుక్రవారం భారీగా తగ్గిన పసిడి సోమవారం మరింతగా నష్టపోయింది. మధ్యాహ్నం సమయంలో యూరప్‌ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 11.05 డాలర్లు నష్టపోయి 1,288.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ సైతం పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో స్వల్పంగా నష్టపోయినప్పటికి.., యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభంతో పసిడిలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో 12డాలర్లు నష్టపోయి 1,287.35డాలర్లు కనిష్టానికి పడిపోయింది.



You may be interested

ఈక్విటీలతోనే అధిక సంపద!

Tuesday 5th March 2019

ఎంతో మంది ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ, సూక్ష్మ అంశాలపై అవగాహన పెద్దగా కనిపించదు. భవిష్యత్తు లక్ష్యాలైన పిల్లల విద్య, వివాహాలు, ఇల్లు, రిటైర్మెంట్‌ తదితర అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు కొందరే ఉంటారు. అందులోనూ పెట్టుబడుల విలువను తినేసే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అవగాహన చేసుకునే వారు బహు కొద్ది మంది. చాలా మంది ఇన్వెస్ట్‌ చేసినా గానీ లక్ష్యాలను చేరుకోవడానికి దూరండా ఉండిపోవడం వెనుక కారణం ఇదే అయి

పాజిటివ్‌గా ప్రపంచమార్కెట్లు

Monday 4th March 2019

చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం రాజీ దిశగా పయనిస్తున్న సాగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రపంచమార్కెట్లలో పాజిటివ్‌ ట్రెండ్‌ నెలకొంది. ఆసియాలో కొరియా, తైవాన్‌ సూచీలు తప్ప మిగిలిన అన్ని మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరోపియన్‌ జోన్‌లో సైతం ప్రధాన మార్కెట్లన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. వాస్తవానికి మార్చి 1నుంచి చైనా నుంచి దిగుమతయ్యే 200 బిలియన్‌ డాలర్ల వస్తువులపై 10శాతం నుంచి 25శాతానికి పెంచాల్సి ఉంది. అయితే  ఈ రెండు దేశాల

Most from this category