STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 10th July 2018
Markets_main1531202922.png-18162

న్యూఢిల్లీ/ముంబై:- బ్రెగ్జిట్‌ సంక్షోభం మరోసారి తెరపైకి రావడంతో పాటు డాలర్‌ విలువ నెలరోజుల కనిష్టస్థాయిలో కొనసాగుతుండంతో ప్రపంచవ్యాప్తంగా మంగళవారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో భారత కాలమాన ప్రకారం ఉదయం గం.11:15లకు ఔన్స్‌ పసిడి ధర 1:03 డాలర్లు పెరిగి 1,260.9 డాలర్ల ట్రేడ్‌ అవుతోంది.  బ్రెగ్జిట్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడంతో  ప్రధాని థెరీసా మే అనుసరిస్తున్న వ్యూహాలను తప్పుబడుతూ సోమవారం బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్‌తో పాటు విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేశారు. దీంతో  ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది.  
దేశీయంగా తగ్గుదల:-
ప్రపంచమార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగినప్పటికీ.., దేశీయంగా మాత్రం స్థిరంగా స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. భారత మార్కెట్లో ఉదయం గం.11:20లకు ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.1:00లు పెరిగి రూ.30618.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి  10గ్రాముల పసిడి  రూ.30617 వద్ద ముగిసింది.



You may be interested

సాంక్టమ్‌ వెల్త్‌ నుంచి వాల్యూ రికమండేషన్లు

Tuesday 10th July 2018

వచ్చే ఒకటిరెండు నెలల్లో దాదాపు 16 శాతం వరకు రాబడినిచ్చే ఐదు వాల్యూ స్టాకులను సాంక్టమ్‌వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రికమండ్‌ చేసింది.. 1. యస్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 410. స్టాప్‌లాస్‌ రూ. 348. గత సంవత్సరకాలంగా రూ. 285- 380 మధ్య కన్సాలిడేషన్‌ చెందింది. ఇటీవలే వీక్లీ చార్టుల్లో ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ పాటర్న్‌ను ఏర్పరిచింది. ఇది బుల్లిష్‌నెస్‌కు సంకేతం. ఎంఏసీడీ సైతం పాజిటివ్‌ క్రాసోవర్‌ఏర్పరిచింది. బోలింగర్‌ బ్యాండ్‌ విస్తరించడంతో

నేడే ఇండస్‌ ఇండ్‌ ఫలితాలు

Tuesday 10th July 2018

మంగళవారం ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ క్యు1 ఫలితాలు ప్రకటించనుంది. దీంతో బ్యాంకింగ్‌ ఎర్నింగ్స్‌కు తెరతీసినట్లు కానుంది. ఈ దఫా బ్యాంకు నికరలాభంలో 21 శాతం వృద్ధి నమోదుకావచ్చని రాయిటర్‌ పోల్‌లో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌తో కలయిక కారణంగా ఈ దఫా లాభంలో 46 శాతం వృద్ధి ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది.  ఫలితాల్లో ఇతర కీలక అంచనాలు... - నికర వడ్డీ మార్జిన్లు 19 శాతం పెరిగి 2128

Most from this category