STOCKS

News


స్థిరంగా పసిడి ధర

Monday 5th November 2018
Markets_main1541396228.png-21710

డాలర్‌ స్థిరమైన ర్యాలీతో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.20లకు ఔన్స్‌ పసిడి ధర 0.50డాలర్‌(అరడాలరు)స్వల్ప లాభంతో 1,233.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా సెనెట్‌లో ఉన్న 100 స్థానాల్లో 35 స్థానాలకు అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు రేపు (మంగళవారం) మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్న కారణంగా డాలర్‌ ఇండెక్స్‌ గత ముగింపు 96.29 వద్దే స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ కూడా పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెరగవచ్చనే అంచనాలతో గతవారం చివరిరోజైన శుక్రవారం  పసిడి ధర స్వల్పంగా నష్టపోయి 1,233.30 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ స్థిరంగానే:-
గతవారం నష్టాలతో ముగిసిన డిసెంబర్‌ కాంట్రాక్టు ఈవారం రూ.14 స్వల్ప నష్టంతో రూ.31736 వద్ద ప్రారంభమైంది. నేడు డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత పసిడి ర్యాలీకి బ్రేక్‌ వేస్తుంది.ఫలితంగా ఇంట్రాడేలో 10గ్రాముల పసిడి గతవారం ముగింపుధర (రూ.31750)తో పోలిస్తే రూ.6ల స్వల్ప నష్టంతో రూ.31744.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ట్యారిఫ్‌లు తగ్గిస్తామని ప్రకటించిన చైనా

Monday 5th November 2018

- స్వేచ్ఛా వాణిజ్యాన్ని మరింత వేగంగా పెంపొందిస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ వ్యాఖ్య. షాంఘై: దిగుమతి సుంకాలను తగ్గిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ సోమవారం ఉదయం ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించడం ద్వారా తమ దేశంలో ప్రపంచ శ్రేణి వ్యాపార వాతావరణాన్ని నెలకొల్పనున్నట్లు ఇక్కడ జరిగిన చైనా ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్‌ ఎక్స్‌పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు. విస్తృత స్థాయి మార్కెట్‌ ప్రవేశం కోసం తాము ఇప్పటికీ

ఎస్తోనియాలో ముకేశ్ అంబానీ జాయింట్ వెంచర్‌

Monday 5th November 2018

టాలిన్‌/ముంబై: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా ఈ-గవర్నెన్స్‌ విభాగంపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ఎస్తోనియా ప్రభుత్వ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తావి కోట్కాతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ-గవర్నెన్స్ సంబంధ సేవలందించేందుకు దీన్ని ఉద్దేశించినట్లు ఎస్తోనియా ఆర్థిక శాఖ సహాయ మంత్రి విల్యార్‌ లుబి తెలిపారు. యూరోపియన్ యూనియన్‌లో భాగమైన తమ దేశంలో ముకేశ్ అంబానీ ఈ-రెసిడెన్సీ కూడా

Most from this category