STOCKS

News


ఆరున్నర నెలల గరిష్టానికి పసిడి

Thursday 3rd January 2019
Markets_main1546497729.png-23384

ఆర్థిక వృద్ధి మందగమనం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో అస్థిరత పసిడి ధరకు కలిసొస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం 9డాలర్లు లాభపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత సైతం పసిడి ర్యాలీకి సహకరిస్తోంది. ఉదయం 11:45ని.లకు ఔన్స్‌ పసిడి ధర 8.85 డాలర్ల లాభపడి 1,292.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది పసిడి ధరకు ఆరున్నర నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. జపాన్‌ కరెన్సీ యెన్‌ ర్యాలీ చేయడంతో పాటు ఆర్థిక మందగమన ప్రభావం డాలర్‌ ఇండెక్స్‌ను వెనక్కిలాగుతుంది. వృద్ధి మందగమనంతో గతేడాది నాలుగో త్రైమాసికపు ఆదాయాలు తగ్గవచ్చనే అపిల్‌ ప్రకటనతో రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్పలాభాలతో ముగియగా, నేడు ఆసియాలో పలు మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అలాగే అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ 12వరోజూ కొనసాగుతుండంతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనవుతున్నారు. ‘‘బలహీన డాలర్‌ పసిడి ధరకు మద్దతునిస్తుంది. ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. పసిడి ధరకు 1280డాలర్లు సాంకేతికంగా బలమైన మద్దతు ధర. ఒకవేళ పసిడిలో ర్యాలీ ఇలాగే కొనసాగితే 1300 డాలర్లకు చేరడానికి మరెంతో కాలం పట్టదు.’’ అని హాంకాంగ్‌ బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు ఫంగ్‌ తెలిపారు.
దేశీయంగా రూ.300లు అప్‌:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధర లాభాల పట్టింది. ప్రపంచమార్కెట్లో పసిడి ధర 9డాలర్లు ర్యాలీ చేయడం, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత తదితర అంశాలు పసిడికి కలిసొస్తున్నాయి. ఎంసీక్స్‌ మార్కెట్లో ఉదయం 11:4నిల.కు 10గ్రాముల పసిడి ధర రూ.300లు లాభపడి రూ.31910.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు

Thursday 3rd January 2019

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర ఒడిదుడుకుల నేపథ్యంలో దేశీయ ఆయిల్‌ మార్కెటిం‍గ్‌ కంపెనీల షేర్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఆర్థిక వృద్ధి మందగమనంతో క్రూడాయిల్‌కు డిమాండ్‌ తగ్గడం, సరఫరా పెరగడంతో గత కొన్ని నెలలుగా క్రూడాయిల్‌ ధర క్షీణిస్తూ వస్తోంది. క్రూడ్‌ ధరలు తగ్గితే ఇప్పటికే ఎక్కువ ధరల వద్ద కొన్న నిల్వలను ఓఎంసీలు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. అలాగే ఈ కంపెనీలు నిర్వహిస్తున్న రిఫైనరీల మార్జిన్లు క్షీణించడంతో డిసెంబర్‌

పార్లమెంట్‌ ముందుకు ఆధార్‌ సవరణ బిల్లు

Thursday 3rd January 2019

న్యూఢిల్లీ: బయోమెట్రిక్ ఐడీ ఆధార్ చట్ట సవరణ బిల్లును కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బ్యాంక్ ఖాతా, మొబైల్ కనెక్షన్లు మొదలైనవి పొందడానికి వినియోగదారులు గుర్తింపు ధృవీకరణ పత్రం కింద ఆధార్‌ను స్వచ్ఛందంగా మాత్రమే ఇచ్చేలా ఇందులో ప్రతిపాదనలున్నాయి. ఆధార్ ఇవ్వడానికి ఇష్టపడని వారికి బ్యాంకు ఖాతా, సిమ్ కార్డులు మొదలైన సర్వీసులు అందించకుండా

Most from this category