STOCKS

News


పుంజుకుంటున్న డాలర్‌ ఇండెక్స్‌: ఫ్లాట్‌గా పసిడి ధర

Monday 26th November 2018
Markets_main1543210458.png-22376

ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడటంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర సోమవారం ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలర్‌ లాభపడి 1,224.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ పాలసీ మినిట్స్‌ గురువారం వెలువనుండంతో పాటు జీ-20 సదస్సులో అమెరికా, చైనా దేశాధ్యక్షులు వాణిజ్య యుద్ధం చర్చలపై కూడా పసిడి కదలికలపై ప్రభావాన్ని చూపతున్నాయి. గతవారం చివరిరోజైన శుక్రవారం అమెరికా ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ వారం గరిష్టస్థాయి(96.84)ని తాకిన నేపథ్యంలో పసిడి ధర 4.80డాలర్ల నష్టపోయి 1223డాలర్ల వద్ద ముగిసింది. ఇకవారం పసిడి ధర విశ్లేషణ విషయానికొస్తే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో డిసెంబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల పెంపుపై సందిగ్దత నెలకొంది.  ఇటీవల అమెరికా విడుదల చేసిన బలమైన ఆర్థిక గణంకాల ఫలితాలు వడ్డీరేట్ల పెంపును ప్రశ్నార్థకం చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం ఫెడ్‌ పాలసీ మినిట్స్‌ విడుదల సందర్భంగా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగంలో కీలక వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచితే డాలర్‌ మరింత బలపడి పసిడి.. కరెక‌్షన్‌ బాట పట్టవచ్చనేది విశ్లేషకుల అంచనా.  శుక్రవారం జరిగే జీ-20 సదస్సులో ‘‘అమెరికా- చైనా దేశాల ట్రేడ్‌వార్‌’’పై ఇరు దేశాధ్యక్షులు చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు సఫలమైతే వాణిజ్యయుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చనే ఆశాభావాన్ని మార్కెట్‌ వర్గాల వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో డాలర్‌ బలపడటం, క్రూడాయిల్‌ ధరలు రోజురోజూకు దిగిరావడం పసిడిధరపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో  అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారంలో పసిడి ధర 1200-1235 డాలర్ల పరిమిత శ్రేణిలో కదలాడవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
దేశీయంగా స్వల్ప పెరుగుదల:-
దేశీయంగా పసిడి ధర స్వల్పంగా లాభపడింది. నేడు ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ పసిడి ధర రూ.30,471.00ల వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.10:30ని.లకు గతవారం ముగింపు ధర(రూ.30519)తో పోలిస్తే రూ.45.00లు లాభపడి రూ.30540.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 3నెలల గరిష్టానికి బలపడినప్పటికీ... ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి లాభాల్లో ట్రేడ్‌ అవ్వడం విశేషం. గతవారంలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటంతో దేశీయంగా పసిడి ధర రూ.306లు నష్టపోయిన సంగతి తెలిసిందే. పసిడి గణనీయ స్థాయిలో పతనమైన ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు నేడు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు బావిస్తున్నారు.



You may be interested

ఒడిదుడుకుల వారం..!

Monday 26th November 2018

ఈ వారమే నవంబర్‌ సిరీస్‌ ఎఫ్‌అండ్‌ఓ ముగింపు -దీంతో మార్కెట్లో ఒడిదుడుకులు -ముడి చమురు ధరల గమనం -డాలర్‌తో రూపాయి మారకం -ప్రపంచ పరిణామాల ప్రభావం -ఈ వారం మార్కెట్‌కు కీలకాంశాలు స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం ఒడిదుడుకులమయంగా సాగవచ్చు. నవంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ఈ గురువారం (ఈ నెల 29న)ముగియనుండటమే దీనికి ప్రధాన కారణం. డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, ప్రపంచ పరిణామాల ప్రభావం, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 26th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 59 డాలర్ల దిగువకు చేరిన నేపథ్యంలో ఆయిల్‌ మార్కెట్‌, ఏవియేషన్‌ షేర్లతో పాటు అపోలో టైర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, సియెట్‌, ఏషియన్‌ పేయింట్స్‌, నెరోలాక్‌ పెయింట్‌ షేర్లులో ర్యాలీ జరగవచ్చు. ఇండెక్స్‌లో మార్పులు, చేర్పులు:- బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ సూచీలు విప్రో, అదానీ పోర్ట్స్‌ షేర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లను

Most from this category