News


స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 10th May 2019
Markets_main1557468439.png-25646

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల లాభంతో 1,287.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాకు చెందిన 200మిలియన్ల దిగుమతులపై అదనంగా విధించిన 15శాతం టారీప్‌ నేటి నుంచి అమల్లోకి రానుంది. చైనా ఈ టారీఫ్‌ పెంపు అంశంపై ప్రతీకార చర్యలు తప్పవని వ్యాఖ్యానించినప్పటికి.., ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రానున్న రోజుల్లో ట్రేడ్‌ వార్‌పై చైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఇన్వెస్టర్లు ముందస్తు రక్షణత్మాక చర్యల్లో బాగంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. పసిడి ధర గతవారంలో 2018 డిసెంబర్‌ కనిష్టానికి పతనమైంది. అయితే, ట్రేడ్‌ వార్‌ తిరిగి తెరపైకి రావడంతో 1.50శాతం రివకరి సాధించింది. 
దేశీయంగా స్వల్ప నష్టాల్లో:- 
పసిడి ధర దేశీయంగా స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. రూపాయి రికవరి కారణమైంది. ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.18.00ల స్వల్ప నష్టంతో 31898.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఎస్‌బీఐ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Friday 10th May 2019

మార్చి త్రైమాసిక ఫలితాలను ఎస్‌బీఐ శుక్రవారం ప్రకటించనుంది. నికర వడ్డీ ఆదాయంలో రెండంకెల వృద్ధి, ప్రొవిజన్లు తగ్గడంతో బ్యాంకు మంచి లాభాలను చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్యు4లో బ్యాంకు రూ.5-7వేల కోట్ల లాభాలన్ని ‍ప్రకటించవచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. అంతకుముందేడాది ఇదే కాలానికి బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఫలితాలపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.. - నార్నోలియా సెక్యూరిటీస్‌: లాభం 53 శాతం పెరిగి

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 10th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సుందరమ్ ఫాస్ట్నెర్స్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ప్రతి ఈక్విటీ షేరుపై రూ.3.10 రెండో మధ్యంతర డివిండెండ్‌ చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- తన అనుబంధ సం‍స్థ రిలయన్స్‌ బ్రాండ్స్‌ హాలేస్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌తో 100శాతం ఈక్విటీ వాటాను రూ.650 కోట్లకు కొనుగోలు చేసేందుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వెల్‌స్పాన్‌ కార్పో:- షేర్ల బై బ్యాక్‌ ఆఫర్‌ అంశంపై చర్చించేందుకు

Most from this category