STOCKS

News


తగ్గుముఖం పట్టిన పసిడి ధర

Wednesday 11th July 2018
Markets_main1531293167.png-18201

ముంబై:- డాలర్‌ పటిష్టమైన ర్యాలీతో బుధవారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. చైనా నుంచి దిగుమతిమయ్యే వస్తువులపై ఇప్పటికే దిగుమతి సుంకాలను విధించిన అమెరికా తాజాగా మరోసారి సుంకాల విధింపునకు సిద్ధమైంది. ఇప్పుడు అదనంగా మరో 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై  పది శాతం సుంకాలు పెంచనున్నట్లు అమెరికా స్పష్టంచేసింది. ఫలితంగా ఆరు ప్రపంచ కరెన్సీ విలువతో పోలిస్తే డాలర్‌ విలువ పెరిగింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 1,255.80 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాలర్‌ విలువ పెరగడంతో తగ్గుముఖం పసిడి ఇంట్రాడేలో 6 డాలర్లు మేర నష్టపోయి పసిడి ఓ దశలో 1,249.4 డాలర్ల కనిష్టాన్ని తాకింది. ఆసియా ట్రేడింగ్‌లో భారతకాలమానం ప్రకారం ఉదయం గం.12:15లకు ఔన్స్‌ పసిడి ధర 2.30 డాలర్లు తగ్గి 1,253.10డాలర్ల ట్రేడ్‌ అవుతోంది. గత రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ఔన్స్‌ 1,255.4డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా రూ.30500 దిగువకు:-
ప్రపంచట్రెండ్‌కు అనుగుణంగానే పసిడి ధర దేశీయంగా తగ్గుముఖం పట్టింది. దేశీయ మార్కెట్లో ఉదయం గం.12:20లకు ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.43లు తగ్గి రూ.30485.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి  10గ్రాముల పసిడి  రూ.30528.00ల వద్ద ముగిసింది.



You may be interested

టీసీఎస్‌ టార్గెట్‌ ధర పెంచిన బ్రోకరేజ్‌లు

Wednesday 11th July 2018

క్యు1 ఎర్నింగ్స్‌పై పాజిటివ్‌ స్పందన అద్భుతమైన జూన్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు టీసీఎస్‌పై మరింత పాజిటివ్‌గా మారాయి. వివిధ బ్రోకరేజ్‌లు టీసీఎస్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం, టార్గెట్‌ను పెంచడం చేశాయి. ఆ వివరాలు.. - మాక్క్వైరీ సంస్థ టీసీఎస్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి అవుట్‌పెర్ఫామ్‌కు పెంచింది. టార్గెట్‌ ధరను రూ. 2015గా నిర్ణయించింది. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగ మందగమనానికి మందువేసేందుకు కంపెనీ చర్యలు చేపడుతోందని, అవి ఫలితాలను ఇస్తున్నాయని

యస్‌ సెక్యూరిటీస్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 11th July 2018

వచ్చే మూడునాలుగు వారాల్లో 15 శాతం వరకు రాబడినిచ్చే మూడు మిడ్‌క్యాప్స్‌ను యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేస్తోంది. 1. ఏఐఏ ఇంజనీరింగ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1855. స్టాప్‌లాస్‌ రూ. 1500. వీక్లీ చార్టుల్లో ఊర్ధ్వముఖ త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ ఇచ్చేందుకు తయారుగా ఉంది. ఈ త్రిభుజాకృతి అవధి రేఖ రూ. 1645 వద్ద ఉంది. దీన్ని భారీ వాల్యూంలతో దాటితే మరింత అప్‌ట్రెండ్‌ కనిపిస్తుంది. డైలీ చార్టుల్లో ఇప్పటికే

Most from this category