STOCKS

News


4రోజూ కొనసాగుతున్న పసిడి పతనం

Wednesday 10th July 2019
Markets_main1562739853.png-26940

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు సందేహాలతో పసిడి పతనం కొనసాగుతుంది. వరుసగా 4రోజూ నష్టాల బాట పట్టింది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు క్షీణించి 1,395.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారంలో శుక్రవారం అమెరికా జూన్‌ మాసపు ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. దీంతో ఈ జూలై 30-31 తేదిల్లో జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంలో కీలక వడ్డీరేట్లు తగ్గింపు మార్కెట్‌ వర్గాల్లో అనుమానాలు తలెత్తాయి. నాటి నుంచి పసిడి ధర పతనం కొనసాగుతూనే ఉంది. పసిడి ధరలకు వ్యతిరేక దిశలో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. నేడు డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో 3వారాల గరిష్టాన్ని తాకింది. మరోవైపు ఈ నేడు, రేపు(బుధ, గురు) అమెరికా కాంగ్రెస్‌ ఎదుట ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమి పావెల్‌ చేసే ప్రసంగంపై ట్రేడర్లు దృష్టిని సారించారు. ముఖ్యంగా వడ్డీ రేట్ల కోతపై ఎలాంటి సంకేతాలు ఇస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే అమెరికా-చైనాల మధ్య జీ-20 సదస్సులో కుదిరిని ఒ‍ప్పందం మేరకు ఇరు దేశాల మధ్య తాజాగా చర్చలు మొదలైనట్లు అమెరికా వైట్‌హౌస్‌ అధికారులు ప్రకటించారు. 
దేశీయం‍గానూ తగ్గుదలే:- 
ఇక దేశీయంగానూ పసిడికి నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర నేటి ట్రేడింగ్లో రూ.172లు క్షీణించి రూ.34410.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధర వరుస పతనంతో పాటు, నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి రివకరి పసిడికి ర్యాలీకి ప్రతికూలంగా మారాయి. నిన్న ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌ ముగింపు సమయానికి రూ.10గ్రాముల పసిడి ధర 10లు స్వల్పలాభంతో రూ.34589ల వద్ద స్థిరపడింది.



You may be interested

భారత టారిఫ్‌లను ఆమోదించేది లేదు

Wednesday 10th July 2019

మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌ వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి భారత్‌ విధిస్తున్న టారిఫ్‌లపై మండిపడ్డారు. భారత్‌ ఎంతో కాలంగా అమెరికన్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లను మోపుతోందని, వీటిని ఇంకెంత కాలం ఆమోదించలేది లేదంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు. గత నెల 28న జీ-20 దేశాల సమావేశం సందర్భంగా ట్రంప్‌, మన దేశ ‍ప్రధానితో సమావేశం అవడం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య వివాదాస్పద అంశాలపై సత్వర చర్చకు అంగీకారానికి వచ్చిన

నాణ్యమైన మిడ్‌క్యాప్‌లను ఎంచుకోండి: దేవన్‌ చోక్సి

Wednesday 10th July 2019

బడ్జెట్‌లో ఇచ్చిన హామీల అమలుపై మార్కెట్లో అనుమానాలు సమీప భవిష్యత్తు ఆదాయాలు తగ్గవచ్చు వృద్ధి రేటు తగ్గితే లార్జ్‌క్యాప్‌ స్టాకులు పడిపోయే అవకాశం: దేవన్‌ చోక్సి   వాల్యుషన్లు దిద్దుబాటు గురవుతున్నపుడే పోర్ట్‌పోలియోలను సిద్ధం చేసుకోవాలని కేఆర్‌ చోక్సె ఇన్వెస్ట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవన్చో‌ చోక్సీ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. అనుమానంలో మార్కెట్లు మార్కట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. మార్కెట్లు ఎటువైపు వెళతాయో చెప్పడం కష్టం కానీ

Most from this category