STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 18th June 2019
Markets_main1560836082.png-26366

డాలర్‌ ఇండెక్స్‌ వెనకడుగుతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు లాభపడి  1,345.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి నుంచి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ మూడు వారాల గరిష్టస్థాయి నుంచి వెనక్కి వచ్చింది. నేడు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97 స్థాయిని కోల్పోయి 96.96 వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా - అమెరికా వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ వృద్ధి మందగమన ఆందోళనలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈసారి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై పావుశాతం కోత ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీరేట్ల కోతతో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడంతో పాటు ఈల్డ్‌ ధర పెరిగింది. ఈ రెండు అంశాలు పసిడి ధర ర్యాలీకి కలిసొస్తాయి. ఇప్పటికే ఫెడ్‌ రేట్ల కోత అంచనాలతో పసిడి ధర ఈ ఏడాది కనిష్టం 1,265.85 డాలర్ల నుంచి 6శాతం ర్యాలీ చేసింది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగింపు నేపథ్యంలో అక్కడ పసిడి ధర 1 డాలరు స్వల్ప లాభంతో 1,342.90 వద్ద స్థిరపడింది.
దేశీయంగానూ స్వల్ప పెరుగుదలే:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ‍నేడు ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.56.00లు స్వల్ప లాభంతో రూ.33,077.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల ట్రేడింగ్‌ పసిడి ర్యాలీకి అవరోధమవుతున్నాయి. 



You may be interested

ఫ్రీగా అయితే చూసేస్తాం!!

Tuesday 18th June 2019

ఆన్‌లైన్ కంటెంట్‌పై 25 శాతం మంది అభిప్రాయమిది తక్కువ ఫీజులు కట్టేందుకు 25% మంది సంసిద్ధత బ్రైట్‌కోవ్ నివేదికలో వెల్లడి ముంబై: ప్రకటనల బెడద ఉన్నప్పటికీ దేశీయంగా 25 శాతం మంది వినియోగదారులు ఓవర్‌ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌పై కంటెంట్‌ను ఉచితంగా చూసేందుకే ఇష్టపడుతున్నారు. పరిమితమైన ప్రకటనలతో ఎంతో కొంత చెల్లించి కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపే వారు పాతిక శాతం మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా వీడియో క్లౌడ్ సర్వీసులు అందించే బ్రైట్‌కోవ్

నష్టాల్లో ఎస్‌బీఐ, ఫెడరల్‌,బీఓబీ,ఐడీఎఫ్‌సీ, యస్‌బ్యాం‍క్‌ షేర్లు

Tuesday 18th June 2019

 బ్యాంక్‌ షేర్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్‌బీఐ 1.07 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.66శాతం, ఐడీఎఫ్‌సీ 0.48శాతం నష్టపోగా బీఓబీ 0.30 శాతం, యస్‌ బ్యాంక్‌ 0.26 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.08శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 0.07శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.  ఉదయం 10.45 సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీ నిఫ్టీ50 ఇండెక్స్‌ 19.90 పాయింట్లు లాభపడి 11692.10 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 88.53 పాయింట్లు లాభపడి 39049.32 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టి

Most from this category