STOCKS

News


పసిడికి బలహీన గణాంకాల మద్దతు

Friday 26th April 2019
Markets_main1556262231.png-25367

బలహీన అమెరికా ఆర్థిక గణాంకాల మద్దతుతో పసిడి ధర 4నెలల గరిష్టస్థాయి నుంచి క్రమంగా రివకరి బాట పట్టింది. ఆసియాలో శుక్రవారం ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు లాభపడి 1,284 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్న రాత్రి విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు మార్కెట్‌ అంచనాల్ని అందుకోలేకపోగా, గతవారంలో అదనంగా 37,000 మంది ఉపాధి కోల్పోయినట్లు ప్రకటించింది. అలాగే  ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలరు ఇండెక్స్‌ తగ్గుదల కూడా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచింది. ‘‘బలహీన ఆర్థిక గణాంకాల నమోదు కారణంగా ఆయా దేశాలు సరళతర ద్రవ్యవిధానాన్ని పాటించవచ్చు. ఇది పసిడి ర్యాలీకి దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న రాత్రి అమెరికా మార్కెట్‌లో పసిడి ధర 1280డాలర్ల వద్ద ముగిసింది. ఈ వారం ప్రారంభంలో పసిడి ధర 1260డాలర్ల వద్ద ఈ ఏడాది కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.
దేశీయంగా స్వల్ప పెరుగుదల:- 
ప్రపంచమార్కెట్లో పసిడి ధర రికవరి బాట పట్టినప్పటికీ, దేశీయ మార్కెట్లో స్వల్ప లాభంతోనే ట్రేడవుతోంది.నేడు ఫారెక్స్‌ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర రూ.36.00లు స్వల్ప లాభంతో రూ.31947.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

టాటా స్టీల్‌ 6 శాతం జంప్‌

Friday 26th April 2019

గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికపు(జనవరి-మార్చి) ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో టాటా స్టీల్‌ కంపెనీ షేర్లు శుక్రవారం లాభాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.520.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్చి క్వార్టర్‌లో కంపెనీ రూ.2,295.25 నికరలాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.33, 984 కోట్ల నుంచి రూ.42, 914లకు పెరిగింది. ఎబిటా రూ.5,857లు నుంచి రూ.7,184 కోట్లకు పెరిగింది. ఒక్కొక్క ఈక్విటీ

రుణగ్రహీతలకు అదనంగా 60 రోజుల గడువు

Friday 26th April 2019

ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తులపై ఆర్‌బీఐ యోచన న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తుల పరిష్కారానికి సంబంధించి మార్గదర్శకాలను ఆర్‌బీఐ సవరించనుంది. రుణ చెల్లింపులకు అదనంగా 60 రోజుల గడువు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. తద్వారా నిజాయితీగా నడిచే వ్యాపార సంస్థలకు ఇబ్బందులు రాకుండా చూడొచ్చని భావిస్తోంది. రుణ వాయిదాల చెల్లింపుల్లో ఒక్క రోజు విఫలమైన సరే వాటిని నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏలు) పరిగణించాలన్న ఆర్‌బీఐ 2018 ఫిబ్రవరి 12

Most from this category