STOCKS

News


1200 దిగువన పసిడి

Monday 10th September 2018
Markets_main1536561140.png-20108

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 1200 డాలర్ల దిగువున ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియా మార్కెట్లో భారతవర్తమాన కాలం గం.10:15ని.లకు ఔన్స్‌ పసిడి 2.20 డాలర్లు నష్టపోయి రూ.1,197.90 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  చైనా-అమెరికా దేశాల మధ్య వీడని వాణిజ్య యుద్ధ భయాలు, అమెరికాలో ఆగస్ట్‌లో అంచనాలకు మించి ఉద్యోగ కల్పన జరగడంతో డాలర్‌ బలపడింది. నేడు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌  95.44 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బలమైన డాలర్‌ విలువ కారణంగా రానున్న రోజుల్లో ఫెడరల్ రిజర్వు రేట్ల పెంపు అంచనాలు బలపడ్డాయి. ఫలితంగా పసిడి ధర నేలచూపులు చూస్తోంది. గత వారంతపు రోజైన శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌కు 2.50 డాలర్లు నష్టపోయి 1,201.80 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
దేశీయంగా రూపీ ఎఫెక్ట్‌:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర బలహీనపడినా.. దేశీయంగా మాత్రం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఎంసీఎక్స్‌లో సోమవారం 10గ్రాముల పసిడి రూ. 31లు లాభపడి రూ.30525.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి మరింత బలహీనపడం అందుకు కారణం. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి రూ.37లు స్వల్పంగా నష్టపోయి రూ.30510.00ల వద్ద ముగిసింది.



You may be interested

కీలకస్థాయి 38,525 పాయింట్లు

Monday 10th September 2018

ఇతర దేశాల సూచీలతో పోలిస్తే కొద్దివారాల నుంచి పటిష్టమైన అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తూ కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్న భారత్‌, అమెరికా సూచీలు, మొత్తంమీద గతవారం కుదుపునకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో చైనాపై ట్రేడ్‌వార్‌ను తీవ్రతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు మరో 267 బిలియన్‌ డాలర్ల సుంకాల్ని విధిస్తామని గత శుక్రవారం ప్రకటించడం, ఈ నెలాకర్లో జరిగే సమీక్షా సమావేశంలో మరోదఫా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపునకు మార్గం సుగమం చేస్తూ పటిష్టమైన

72.50 దిశగా రూపీ పతనం

Monday 10th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 72.50 దిశగా పతనమౌతోంది. సోమవారం నెగటివ్‌గా ప్రారంభమైన రూపాయికి పోనుపోను మరింత నష్టపోయింది. ఇంట్రాడేలో ఉదయం 10:35 సమయంలో 72.41 ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి పతమైంది. డాలర్‌కు బలమైన డిమాండ్‌, అధిక క్రూడ్‌ ధరల కారణంగా కరెంట్‌ అకౌంట్‌ లోటు నాలుగు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.16

Most from this category