STOCKS

News


డాలర్‌ ఎఫెక్ట్‌: నష్టాల్లోకి పసిడి

Thursday 28th March 2019
Markets_main1553757514.png-24840

డాలర్‌ ర్యాలీ కారణంగా గురువారం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు నష్టపోయింది.యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితులు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై స్పష్టమైన సమాచారం లేకపోవడం అమెరికా యూఎస్‌ క్రూడ్‌ ఇన్వెంటరీ నిల్వలు అంచనాలకు మించి నమోదు కావడంతో ముడిచమురు ధరలు సైతం తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు డాలర్‌ ర్యాలీకి తోడ్పడ్డాయి. ఫలితంగా గత రెండు రోజులుగా ర్యాలీ కొనసాగిస్తూ నేడు కూడా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 2 వారాల గరిష్టానికి చేరుకుంది. సాదారణంగా అమెరికా డాలరు, పసిడి ధరలు వ్యతిరేక దిశల్లో ట్రేడ్‌ అవుతుంటాయి. ఒకవేళ డాలరు పెరిగితే పసిడి రేటు తగ్గడం, డాలరు క్షీణిస్తే పసిడి రేటు పెరగడం జరుగుతుంటాయి. నేడు డాలరు బలపడటంతో పసిడి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 2డాలర్లు క్షీణించి 1,317 డాలర్ల కనిష్టానికి చేరుకుంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 1,314.85 డాలర్ల వద్ద ముగిసింది. 
దేశీయంగా స్వల్పంగా తగ్గిన పసిడి:-
దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగానే తగ్గింది. ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.46లు తగ్గి రూ.31970.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి పతనం దేశీయ మార్కెట్లో పసిడి పతనాన్ని అడ్డుకుంటుంది. 



You may be interested

పసిడే పదిలం..

Thursday 28th March 2019

- అంతర్జాతీయంగా అనిశ్చితి - అమెరికాలో మాంద్యం భయాలు - సుర క్షితమైన బంగారంవైపు ఇన్వెస్టర్ల మొగ్గు - దేశీయంగా రేటు రూ. 38,000కు పెరగొచ్చన్న అంచనాలు     అగ్రరాజ్యం అమెరికా మళ్లీ మాంద్యంలోకి జారిపోనుందన్న భయాలు ఒకవైపు ప్రపంచ దేశాల వృద్ధి మందగించవచ్చన్న ఆందోళన మరోవైపు.. ఇన్వెస్టర్లను మళ్లీ పసిడి వైపు మళ్లేలా చేస్తున్నాయి. పదేళ్ల అమెరికా ట్రెజరీ బాండ్‌ రేటు.. మూడు నెలల రేట్ల కన్నా దిగువకి పడిపోవడం... అగ్రరాజ్యంలో మాంద్యం రాబోతోందనడానికి

యూఎస్‌ బాండ్‌ ఇన్వర్షన్‌తో ఇండియా ఈక్విటీలకు మేలు

Thursday 28th March 2019

అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ ఇన్వర్షన్‌(ఒకే క్రెడిట్‌ క్వాలిటీ ఉన్న దీర్ఘకాలిక డెట్‌ సాధనాలు, స్వల్పకాలిక డెట్‌ సాధనాల కన్నా తక్కువ ఈల్డ్‌ ఇవ్వడం) సంకేతాలు ఇవ్వడం త్వరలో ఆర్థికమాంద్యం వస్తుందనేందుకు సంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పన్నెండేళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్లు ఫుల్‌ బూమ్‌లో ఉన్నప్పుడు యూఎస్‌ బాండ్‌ఈల్డ్స్‌లో ఇన్వర్షన్‌ ఏర్పడింది. అనంతర ఏడాదిలో సబ్‌ప్రైమ్‌ సంక్షోభంతో ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారింది. పుష్కర కాలం తర్వాత గతవారం యూఎస్‌బాండ్‌ మార్కెట్లో

Most from this category